Kohli on Mental Strength
ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మార్క్ నికోలస్ నిర్వహించిన ‘నాట్ జస్ట్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌లో కోహ్లీ తన జీవితంలో కఠిన దశగురించి వివరించాడు. ఇంగ్లాండ్‌లో 2014లో పర్యటించినప్పుడు ఆ సిరీసులో ఐదు టెస్టుల్లో కోహ్లీ వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6, 20 పరుగులు మాత్రమే చేశాడు. పది ఇన్నింగ్సుల్లో 13.50 సగటు మాత్రమే సాధించాడు. ఆ పర్యటన తర్వాత ఆసీస్‌కు వెళ్లిన విరాట్ అక్కడ 692 పరుగులు చేసి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కుంగుబాటుకు గురయ్యారా అన్న ప్రశ్నకు విరాట్ ‘అవును. అయ్యాను "ప్రపంచంలో నేన్కొడినే ఒంటరి" అనే భావనలో కూడ ఉన్నాను’’ అని జవాబిచ్చాడు. ‘పరుగులు చేయలేకపోతున్నామని తెలిసిన అనుభూతి గొప్పదేం కాదు. ప్రతి క్రికెటర్ ఏదో ఒకదశలో తన నియంత్రణలో ఏదీ ఉండదని అనుకుంటాడు. అప్పుడు నా జీవితంలో అండగా నిలిచేవాళ్లున్నా ప్రపంచంలో నేను ఒంటరినని అనిపించేది. మాట్లాడేందుకు మనుషులు లేరని కాదు. నా మనసులో ఏముందో పూర్తిగా అర్థం చేసుకొనే నిపుణుడు లేరనిపించింది. నిజానికి ఇది పెద్ద విషయం. ఈ పరిస్థితిలో మార్పు చూడాలనుకున్నా’ అని కోహ్లీ అన్నాడు. కెరీర్‌ను నాశనం చేయగల మానసిక ఆరోగ్య సమస్యలను నిర్...