Vamsi Kalugotla (Complete Works Draft)
06.05.2021 నీవల్ల కాదని ఎవరో అన్నారని ... ఆగిపోకు నువ్వు సాధించగలవని ఇంకెవరో అన్నారని ... పరిగెత్తకు నువ్వు ప్రేమించేది నీకు నచ్చింది చెయ్ *** వంశీ కలుగోట్ల ✍️🤘 05.05.2021 // అనుకుంటాం కానీ ... // *********************************** విజయం సాధించటానికి యుద్ధం చెయ్యాలని అనుకుంటాం కానీ ... ఆ అవసరమే లేదని గోబెల్స్ సృష్టించిన ఆధునిక ప్రపంచం నేర్పింది పోరాటానికి ఆయుధం అవసరం అనుకుంటాం కానీ ... అక్కర్లేదని పిల్లాడు సాధించుకున్న బొమ్మ నాకో నిజాన్ని చెప్పింది అద్భుతాలు చెయ్యటం దేవుడికే సాధ్యం అనుకుంటాం కానీ ఆర్తుల మొహంపై చిరునవ్వు అనే అద్భుతాన్ని సాధించిన మనీషిని చూసినపుడు నేను కూడా ... అద్భుతాలు సాధించగలనని తెలిసింది. 3 May 2021 ఒకరు ఓడారు, ఒకరు గెలిచారు. మిగతా అంతా మామూలే ... 🤷 3 May 2021 సూడు సిద్దా వరదొచ్చినపుడు మంచీ, సెడ్డా ఏమీ ఉండదు ఊరు మొత్తం కొట్టుకుపోతాది. దేవుడు నీ మంచిసెడ్డల లెక్కలు రాసుకుంటా కూకోడు *** వంశీ కలుగోట్ల ✍🤘 3 May 2021 · పంజరంలో చిలుక అడిగింది జీవితం ఎలా ఉంది అని...