Vamsi Kalugotla (Complete Works Draft)

 06.05.2021

నీవల్ల కాదని 
ఎవరో అన్నారని  
... ఆగిపోకు 

నువ్వు సాధించగలవని 
ఇంకెవరో అన్నారని 
... పరిగెత్తకు 
నువ్వు ప్రేమించేది 
నీకు నచ్చింది చెయ్ 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

05.05.2021
// అనుకుంటాం కానీ ... //
***********************************
విజయం సాధించటానికి
యుద్ధం చెయ్యాలని అనుకుంటాం కానీ ...
ఆ అవసరమే లేదని
గోబెల్స్ సృష్టించిన ఆధునిక
ప్రపంచం నేర్పింది
పోరాటానికి ఆయుధం
అవసరం అనుకుంటాం కానీ ...
అక్కర్లేదని పిల్లాడు సాధించుకున్న బొమ్మ
నాకో నిజాన్ని చెప్పింది 
అద్భుతాలు చెయ్యటం
దేవుడికే సాధ్యం అనుకుంటాం కానీ
ఆర్తుల మొహంపై చిరునవ్వు అనే అద్భుతాన్ని
సాధించిన మనీషిని చూసినపుడు
నేను కూడా ...
అద్భుతాలు సాధించగలనని తెలిసింది.

3 May 2021
ఒకరు ఓడారు, 
ఒకరు గెలిచారు. 
మిగతా అంతా మామూలే ... 🤷

3 May 2021
సూడు సిద్దా వరదొచ్చినపుడు మంచీ, సెడ్డా ఏమీ ఉండదు ఊరు మొత్తం కొట్టుకుపోతాది. 
దేవుడు నీ మంచిసెడ్డల లెక్కలు రాసుకుంటా కూకోడు
*** వంశీ కలుగోట్ల ✍🤘

 
3 May 2021
  · 
పంజరంలో చిలుక అడిగింది 
జీవితం ఎలా ఉంది అని 
లాక్డౌన్ కష్టాలు అన్నీ ఏకరువు పెడుతూంటే 
విని జాలిగా నవ్వింది 🤷‍♂️
*** వంశీ కలుగోట్ల ✍🤘

 
2 May 2021
పార్టీ సంస్థాగత నిర్మాణం పట్ల దృష్టి పెట్టకుండా, తామేం చేయగలరో ఒక స్పష్టత లేకుండా అధికారంలో ఉన్నవారిని విమరిస్తే ఓట్లు పడవని కమల్ హాసన్ కూడా నిరూపించాడు 😉

 
28 April 2021
యుద్ధం వచ్చినప్పుడు/చెయ్యాల్సొచ్చినప్పుడు 
పోరాడి గెలిచేవాడు యోధుడు
తాను గెలవగలను అని నిరూపించుకోవడానికి 
యుద్ధం చేసేవాడు క్రూరుడు 
*** వంశీ కలుగోట్ల ✍🤘

 27 April 2021
నడిచే దారిలో
పాదముద్రలెన్ని కనబడుతున్నా
గమనం మాత్రం ఒంటరే
చుట్టూ నదులెన్నున్నా 
దాహం తీరదు 
సమూహాల మధ్యలో ఉన్నా 
ఒంటరితనం వీడదు 
"మాయ"
*** వంశీ కలుగోట్ల ✍️🤘

24 April 2021
బాధను మర్చిపోవాలన్నా
సంతోషం గుర్తుండిపోవాలన్నా 
షేర్ చేసుకుని 
సెలెబ్రేట్ చేసుకోవాలి 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

 
20 April 2021
"రాతల్లో బోలెడు నీతిని ప్రబోధించే మీరు నీతిగా ఉంటారా?" అని శ్రీశ్రీ గారిని ఎవరో అడిగారట. దానికాయన "ఊరికి దారి చెబుతూ రోడ్ మీద బోర్డ్ ఉంటుంది. ఆ రోడ్ వెంట మనం వెళ్ళాలి గానీ ఆ బోర్డు వెళ్ళదు కదా!" అన్నాడట.
నోట్: ఎంతవరకూ నిజమో కాదో కానీ త్రివిక్రమ్ డవిలాగు పంచ్ కంటే కిక్కెక్కువ ఉన్న సమాధానమది👌👌👌


 
15 April 2021
నాకు బాగా తెలిసిన ఒకతను బాగా సక్సెఫుల్ పర్సన్ అయ్యాడు, అంతకుముందు నాతో సలహాలు తీసుకునేవాడు. 'మీ సలహాలే నాకు బాగా ఉపయోగపడుతున్నాయి' అని చెప్పేవాడు. బాగా సక్సెఫుల్ అయ్యాక, తీరిక లేకనో మరోటో కానీ కలవడం మానేశాడు. కామన్ ఫ్రెండ్ ఒకడు ఆ మధ్యన కలిశాడట, 'మనోడి సలహాల వల్లే నువ్వు బాగా ఎదిగావట కదరా' అన్నాడుట. దానికి వాడు 'సక్సెస్ హాస్ మెనీ ఫాదర్స్' అన్నాడుట. దానివల్ల నాకు అర్థమైన విషయం ఏంటంటే 'నిజంగా అవతలివాడు మన సలహాలు తీసుకునే రేంజ్ లో మనం ఉంటే, అది వాడు చెప్పాలి మనం చెప్పుకోకూడదు'. మన మంచితనం చెప్పుకోవచ్చబ్బా, మన గొప్పతనం మనం చెప్పుకోకూడదు. ఏందీ అర్థమైందా అదీ సంగతి.  
*** వంశీ కలుగోట్ల ✍️🤘

 
14 April 2021
మృత్యువును జయించడమంటే 
చావకుండా ఉండటం కాదు
చచ్చిన తరువాత కూడా 
నువ్వు తపించిన లక్ష్యం కోసం 
పోరాటం ఆగకపోవటం
నీవారో
నిన్ను మెచ్చినవారో
నీ భావాలను సమర్థించేవారో 
ఎవరైతేనేం 
పోరాటం ముందుకు తీసుకుపోవటానికి 
నీకు అమరత్వం ఆపాదించటానికి
"మృత్యువు కూడా ఆపలేని లక్ష్యపు గమనమే అమరత్వాన్ని సిద్ధింపజేసేది"
*** వంశీ కలుగోట్ల ✍️🤘

12 April 2021
నువ్వూ, నేనూ అనేవి
అస్థిత్వాలుగా ఉన్నంతకాలం
మనం అనేది భ్రమ మాత్రమే
దేశాలు, సరిహద్దులు
... ఉన్నంతకాలం
యుద్దాలు జరుగుతూనే ఉంటాయి
సమానత్వం, శాంతి అన్నవి
భావుకులు రాసుకునే కవితల్లో
ఆశలుగా వికసిస్తుంటాయి
*** వంశీ కలుగోట్ల ✍🤘

 · 
11 April 2021
 // ... నమ్మకు // 
ఎవడన్నా 
దేశం కోసం, ప్రజలకోసం 
అంటూ వచ్చాడంటే నవ్వుకో 
గొర్రెలా తలూపకు 
*
గ్రామం, ప్రాంతం 
రాష్ట్రం, దేశం ... 
అవన్నీ భౌగోళీకాలు కావు 
కొందరు సమూహంగా ఏర్పడి 
తాము మాత్రమే ఉండాలనుకుని 
గీసుకున్న విభజన గీతలు 
ఏర్పరుచుకున్న విభేదాల కంచెలు 
*
అందరి కోసం ... 
అని ఎవడన్నా అన్నాడంటే 
తానున్న సమూహం కోసం అని 
సమూహం ద్వారా 
తానెదగడం కోసమని 
*
మనిషన్నోడెవడూ లేడిక్కడ 
గ్రామస్థులు, రాష్ట్రీయులు, దేశస్థులు 
అవేవీ కాకపొతే 
కులస్థులు, మతస్థులు తప్పించి 
మనిషికి చోటు లేదిక్కడ 
*
మనిషిగా గుర్తింపబడాలంటే 
కులమో, మతమో, ప్రాంతమో, దేశమో 
ఎదో ఒక ముసుగేసుకుని 
సమూహంలో కలిసిపోవాల్సిందే 
*
నువ్వూ, నేనూ అనేవి 
అస్థిత్వాలుగా ఉన్నంతకాలం 
మనం అనేది భ్రమ మాత్రమే 
దేశాలు, సరిహద్దులు 
... ఉన్నంతకాలం 
యుద్దాలు జరుగుతూనే ఉంటాయి 
సమానత్వం, శాంతి అన్నవి 
భావుకులు రాసుకునే కవితల్లో 
ఆశలుగా వికసిస్తుంటాయి

 
6 April 2021
ఎవరెన్ని పాఠాలు చెప్పినా 
ఎన్ని సూక్తులు చెప్పినా 
అర్థం చేసుకోవలసింది ఒకటే 
"బలవంతుడవైతే 
... వేటాడు 
బలహీనుడవైతే 
... పరిగెత్తు"
... చంపు లేదా చావు 
ప్రకృతి ధర్మం అదే 
(అవసరమో కోసమో
ఆధిపత్యం కోసమో)
*** వంశీ కలుగోట్ల ✍️🤘

 
2 April 2021
వాడు: ఏం చేస్తున్నావు రా
వీడు: రాస్తున్నాను
వాడు: ముందు బాగా చదువురా
వీడు: చదవటానికే కదా రాస్తున్నది
వాడు: 🤨🤨🤨
*** వంశీ కలుగోట్ల ✍


2 April 2021
// ... పాఠకులు //
రాసే ప్రతి అడ్డగోలు రాతనూ
చదివి వదిలేసే వాళ్ళు కాదు ... పాఠకులంటే

కాసింత మంచిని, మరికాస్త స్ఫూర్తిని
అక్షరాలతో పంచినందుకే  
నిన్ను భుజాన మోసే మనుషులు
నడిపించే కరతాళధ్వనులు
ప్రోత్సహించే సహృదయులు వాళ్ళు

కొన్ని కాలాలు కక్కే చెత్తనంతా వేరు చేసి
అక్కడక్కడా కనబడే కాసింత స్ఫూర్తిని
... స్వీకరించగలిగే రాజహంసలు పాఠకులు

1 April 2021
సూడు సిద్దా, బాధలను మించిన ఆనందాలను సాధించటమే జీవితంరా
*** వంశీ కలుగోట్ల ✍🤘


30 March 2021
మంచితనంతో బతికేవాళ్ళను 
బహుశా గౌరవిస్తారేమో  
ఇంకా మంచోళ్ళయితే దేవుళ్ళుగా పూజిస్తారేమో  
తప్పించి, ఆ మంచిని పాటించడం అంటే 
... ఊహూ, కుదరదు 
రాముడిని విగ్రహరూపధర్మం చేసి 
... గుడిలో బందీని చేశారు 
గాంధీని నోట్లమీద బొమ్మను చేశారు 
సంవత్సరానికి ఒక డ్రైడేగా మార్చారు 
ఇక నువ్వూ నేనూ ఎంత 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

30 March 2021
If you compromise with your mistakes now – you will have to compromise with the failures in future.
*** VK007 ✍️🤘

23 March 2021
మిరపకాయ పంట మన దేశానికి తేకముందు మన దేశంలో మిరియాలే వాడేవాళ్ళు అని తెలియడం జ్ఞానం; కారంపొడి, మిరపకాయలు లేకపోతే మిరియాలపొడి కారం కోసం వాడవచ్చు అని తెలియడం అవగాహన; కారంపొడి లేకపోతే వంటే చెయ్యలేమనుకోవడం మూర్ఖత్వం; ఎర్రగా ఉంది కదా, అది కూడా కారపు రుచే ఉంటుందనుకుని కుంకుమ వాడటం అమాయకత్వం. అవన్నీ చేసేవారిని చూస్తూ ఊరకుండటం నిగ్రహం, ఆ విషయాలన్నీ తెలిసి కూడా ఇలా చెప్పటం దూలానందం
*** వంశీ కలుగోట్ల ✍️

20 March 2021
నేరస్థులు కౄరంగా కనబడతారా? అంటే మరి సినిమాల్లో, సీరియల్స్ లో, లఘు చిత్రాలలో అలానే చూపుతారు కదా. కౄరంగా కనబడుతూ; మందు, సిగరెట్ తాగుతూ ... ఇలా. 
అదేంటో కానీ పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టినపుడు చాలామంది మనలానే మామూలుగా ఉంటారు. 
ఖలేజా సినిమాలో ఒక సన్నివేశంలో ఎందుకు పారిపోయి వచ్చావు అని అడిగితే 'వాడి దగ్గర కండోమ్స్ ఉన్నాయండి' అంటుంది అనుష్క. దానికి మహేష్ బాబు 'నా దగ్గర అవి కూడా లేవండీ' అంటాడు వెటకారంగా. 
వేషాన్ని చూసి మోసపోయే అలవాటు ఉంది కాబట్టే, మేకవన్నెపులులు ఎక్కువుంటాయ్. మంచితనం ముసుగేసుకున్న పెద్దమనుషులుంటారు. జాగ్రత్తగా మసలుకోండి అని ఎవరూ చెప్పరు, మనం తెలుసుకోవాలంతే 🤓
*** వంశీ కలుగోట్ల ✍️🤘

19 March 2021
  వ్యవస్థలు వ్యక్తులను ప్రేమిస్తాయా? 
హ్మ్ వ్యవస్థల్లో కూడా వ్యక్తులే ఉంటారు. ఆ వ్యక్తులను, మరికొందరు వ్యక్తులు నియమిస్తారు. ఆ వ్యక్తులు, ఈ వ్యక్తులు అవసరార్థం పరిధిలోనో, పరిధికి ఆవలనో ఒకరికొకరు సహాయం చేసుకోవడం అన్నది వ్యక్తిగతమే తప్ప వ్యవస్థ లక్షణం కాదు. 
"వ్యవస్థ వ్యక్తులమీదే ఆధారపడి ఉంటుంది"
*** వంశీ కలుగోట్ల ✍️🤘

16 March 2021
గెలిస్తే,  పని చెయ్యాలి (చేయించాలి)
ఓడిపోతే, పోరాడాలి
ఏమైనా సరే మనమంటూ ఉండాలి
*** వంశీ కలుగోట్ల ✍️🤘

 
15 March 2021
'బొంబాయి ప్రియుడు' అని రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఉంది. అందులో ఒక పాట ఉంటుంది 'చందన చీరను గట్టి ఐటెక్స్ కాటుక పెట్టి కొత్త పెళ్ళి కూతురొచ్చెనే ...' అని. చాలా ఫన్నీగా ఉండేది అది వింటుంటే ... అందులో అన్నీ బ్రాండ్ నేమ్స్ వాడి పాట రాశారు. ఏదో సరదాగా అనుకున్నాము కానీ, సీరియస్ గా తీసుకోలేదు. కానీ, ఇపుడు మన జీవితాలను కార్పోరేట్స్ నడుపుతున్న విధానం చూస్తోంటే అర్థమవుతోంది. దంతధావనానికి ఉప్పు, బొగ్గు, వేపపుల్ల లాంటివి మంచివి కాదని మనకు బ్రష్, పేస్ట్ అలవాటు చేసిన ఇన్నేళ్ళకు - ఇపుడు ఉప్పు, వేప, లవంగం లాంటివి పేస్ట్ లు అమ్ముతున్నారు. సబ్బులూ అంతే ... సున్నిపిండి కాదని సబ్బులు అలవాటు చేసి, ఇపుడు సున్నిపిండి, ముల్తానీ మట్టి సబ్బులు వచ్చాయి. ఇపుడు మన జీవితాలు కార్పొరేట్ ప్రభావితంగా నడుసుతున్నాయి తప్పించి, మన ఇష్టానుసారమైతే కాదేమో. మన ఇష్టాయిష్టాలను ప్రభావితం చేసి, మనలను పూర్తిగా వారి అధీనంలో ఉంచుకుంటున్నాయి. ఇది ఇలానే కొనసాగితే బహుశా కార్పొరేట్ ప్రమేయం లేకుండా భవిష్యత్తులో మనం ఉచ్చ కూడా పోసుకోలేమేమో 🤦🤷
*** వంశీ కలుగోట్ల ✍️🤘

· 
9 March 2021
కొన్ని కాయలు పండై రాలిపోతాయి 
కొన్ని తుంచివేయబడతాయి 
కానీ చెట్టు మాత్రం అలానే ఉంటుంది 
కొన్ని తరాల కాయలను మోస్తూ 
పండై రాలిపొమ్మని కాయలకు చెప్పదు 
తుంచేయబడేటపుడు ఆపదు 
... చెట్టొక భావరహిత వేదాంతి 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

· 
8 March 2021
... నమ్మకం అనేది 
ఎదుటివాడి మీద ఉంటే ఆశ ఉంటుంది
పరిస్థితుల మీద ఉంటే పిరికితనం ఉంటుంది
శత్రువు మీద ఉంటే భయం ఉంటుంది
మనమీద మనకు ఉంటే ధైర్యం ఉంటుంది
నమ్మకం ఎవరిమీద ఉందన్నది 
... మన భవిష్యత్తును శాసిస్తుంది  
*** వంశీ కలుగోట్ల ✍️🤘

 
2 March 2021
నేను నిష్పాక్షికంగా ఉండగలనా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఉండలేను అనే సమాధానం వస్తుందని నాకు తెలుసు. 'నా' అనే భావన నన్ను వదలనంతవరకూ నిష్పాక్షికత అలవరచుకోలేనని స్పష్టత ఉంది. అన్నీ వదిలి సన్యసించామని చెప్పుకునేవారు కూడా ఏదొక మతానికో, సిద్ధాంతానికో అనుకూలురై ఉండటం చూస్తూనే ఉంటాం. అలాంటిది నాలాంటి వాడి నుండి నిష్పాక్షికత ఆశిస్తున్నారంటే 🤷 (నేను చెప్పేదంతా నాకు అర్థమైన కోణంలోంచే) 
*** వంశీ కలుగోట్ల ✍️🙏

1 March 2021
అవమానాలు, ఛీత్కారాలు, తిరస్కరణలు ఎదురైనపుడు పోరాడినవాడు అమితాబ్ అవుతాడు, చిరంజీవి అవుతాడు, రజనీకాంత్ అవుతాడు - పోరాడలేనివాడు గోడమీద బొమ్మవుతాడు, ఇంట్లో వాళ్ళకు ఒక కన్నీటి జ్ఞాపకంగా మిగులుతాడు. ఆగిపోవడానికి 99 కారణాలు ఉండొచ్చు, ముందుకు సాగటానికి ఒక్క కారణం వెతుక్కోవడంలోనే గెలుపు దాగి ఉంటుంది. 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

 
27 February 2021
సినిమాల్లో టెక్నికల్ ఎఫెక్ట్స్ లాంటిది నమ్మకం అంటే, అది నిజం కాదని నీకూ తెలుసు, అయినా చూసినపుడు నమ్మబుద్దేస్తుంది అదంతే. నచ్చిందా లేదా అన్నదే ముఖ్యమిక్కడ తప్పించి నిజమా కాదా అని అయితే కాదు.  
*** వంశీ కలుగోట్ల ✍️🤘

25 February 2021
ఎవరికెంత తెలుసు అనే చర్చ వృధా! ఆసక్తి ఉంటే తెలుసుకుంటూ పోవడమే. తెలిసిన/తెలుసుకున్న దాంట్లో నిజమెంత అని తర్కించుకోగలగడమే జ్ఞానం వైపు మొదటిమెట్టు. మనిషిని జ్ఞానం వైపు సాగకుండా ఆపే ప్రతిదీ మూర్ఖత్వమే - మతం, కులం, మరోటి. 'అంటీఅంటనట్టుండిన చలికాచవచ్చునగ్గితో ...' అన్నట్టు కులమతాలను ఎంతవరకూ ఉంచాలో, అక్కడితో ఆపాలి. మన మతం/కులం మన ఇంటి గడప దగ్గరే ఆగిపోవాలి; మన విశ్వాసం ప్రార్థనాలయాల మెట్ల దగ్గరే నిలబడిపోవాలి 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

___________________
 
24 February 2021
Everybody acts like a fresher in their own problems. But, acts like an experienced in someone else's problems.

23 February 2021
నాతో నేను 
నువ్వు కష్టాల్లో ఉన్నపుడు
సహాయం చేసేవారికంటే 
అవకాశం తీసుకుందామనేవారే ఎక్కువ 
... అందుకే 
నీ కష్టాన్ని, బాధను ప్రదర్శించకు 
నీలో నువ్వు 
నీతో నువ్వు పోరాడు 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

 
22 February 2021
కొన్ని మాటలు నువ్వు వాడితే మంచిముత్యాలు, ఎదుటోళ్ళు వాడితే బూతులు అయిపోవు. బూతులు నువ్వు తిట్టినా, ఫేక్ ఐడిలతో తిట్టించినా, నిన్ను వేరొకరు తిట్టినా, ఫేక్ ఐడిలతో తిట్టించినా ఒకటేరా బద్దం. ఫేక్ ఐడిలతో ఎదుటోళ్లను తిట్టించినపుడు ఎంజాయ్ చేసి, నిన్ను తిడితే విలువలు/సిద్ధాంతాలు మాట్లాడ్డం సరికాదురా బద్దం. మేటర్ ఏంటంటే పూరి జగన్నాథ్ చెప్పినట్టు కాలం అందరి దూల తీర్చేస్తది. అయినా ఒరేయ్ బద్దం ... ఇంక చాల్లే, నీకు ఈ మాత్రం చెప్పడమే ఎక్కువ. ఈ మాత్రం టైం ఇవ్వడమే నీకు గొప్ప గౌరవం. కాబట్టి కాస్త మోకాలు మర్దన చేసుకుంటూ ఉండరా బద్దం. చివరగా ఒకమాటరోయ్, నువ్వు నమ్ముతావ్ కాబట్టి సెప్తన్నా 'కర్మ ఈస్ ఏ బూమెరాంగ్ యు నో' 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

 
20 February 2021
టాలెంటున్నోళ్ళు ఒక ఫీల్డ్ కే అంకితమైపోతారు అని పురాగ్రంథాలు ఘోషిస్తున్నాయట. అందుకే నాలాంటోళ్ళు ప్రతి ఫీల్డ్ లో ఒక రాయి వేసి చూస్తా ఉంటారు. ఏదో ఒకటి తగిలితే దూసుకుపోయే ఛాన్సెస్ బానే ఉంటాయి కదా. అయినా సక్సెస్ కి టాలెంట్ కి సైన్టిఫిక్ గా సంబంధమేమీ లేదని అవే పురాగ్రంథాలు ఘోషిస్తున్నాయట కదా 😉😂

 
18 February 2021
BE YOUR OWN GHOST, BUT NEVER BE SOMEONE ELSE'S SHADOW 
*** VK007 ✍️🤘

18 February 2021
నేనేం సిగ్గు పడట్లేదు, బాధ పడట్లేదు - ఎందుకంటే నేను అభిమానించింది ఆయన రచనల్ని, ఆయన్ను కాదు. నచ్చిన రచనల్ని ఎలా మెచ్చుకుంటానో, నచ్చని చర్యల్ని అలానే విమర్శిస్తాను. మనలాగే ఆయన ఒక మనిషి - మారుతుంటాడు అవసరాన్ని బట్టి, ఎదుగుతుంటాడు అవకాశాలనుపయోగించుకొని. నేను ఆయన రచనల్ని విపరీతంగా ఇష్టపడతాను. ఆయన కొన్ని మాటల్ని సమర్థించను/ఖండిస్తాను/అంగీకరించను.

17 February 2021
When people say you are good ... it means you are good to them and the decision is subjected to their needs 
*** VK007 ✍️🤘

17 February 2021
ఇంతమంది మొరుగుతున్నా పట్టించుకోవట్లేదంటే, వాడికి తానేం చెయ్యాలనుకున్నాడో దాని గురించి పిచ్చ క్లారిటీ ఉన్నట్టుంది. అధికారం ఉన్నోడితో, బలం ఉన్నోడితో, డబ్బు ఉన్నోడితో పెట్టుకోవచ్చు - కానీ క్లారిటీ ఉన్నోడితో పెట్టుకుంటే జస్ట్ టైం వేస్ట్ అంతే. వాడేం మాట్లాడడు, సమాధానమివ్వడు - జస్ట్ చేసుకుంటూ పోతాడు అంతే
*** వంశీ కలుగోట్ల ✍️🤘

 
16 February 2021
నాతో నేను 
సాధింపబడేవరకూ
       కలలకు విలువుండదు
కలల సాధనకోసం
       పయనించే పథికుడికి
... అలుపు ఉండదు

15 February 2021
కవిత్వం చెప్పటమంటే/రాయటమంటే అబద్ధం చెప్పటం కాదండీ గూట్లే గారు - అందంగా చెప్పటం
*** వంశీ కలుగోట్ల ✍️🤘

 
15 February 2021
భయాల కాలపరిమితి తక్కువ, మనలో ఉన్న అవగాహనాలోపం తొలగించుకోగలిగితే భయం పోయినట్టే. ధైర్యం అలా కాదు - ఒకసారి ధైర్యం వచ్చిందంటే, అది మనల్ని చివరి వరకూ వెన్నంటి ఉంటుంది. అవగాహన పెరిగేకొద్దీ ధైర్యం మరింత దృఢమవుతుంది. పాపభీతి, దైవభక్తి, దయ్యాలున్నాయని నమ్మడం ఇలాంటివన్నీ ఫోబియాల్లాంటివే లేదా న్యూనతలు అని చెప్పవచ్చేమో. తరతరాలుగా మెదళ్ళను ట్యూన్ చేయడానికి వాడబడినవి. అయితే వాటివల్ల చెడు కంటే మంచి ఎక్కువ జరుగుతోందనే అభిప్రాయం జనబాహుళ్యంలో ఉంది. కానీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో దైవం పట్ల నమ్మకం/భయం అన్న ఫోబియా/న్యూనత మంచికంటే చెడుకే ఎక్కువ కారణమవుతోందేమో అనిపిస్తుంది.
*** వంశీ కలుగోట్ల ✍️🤘

13 February 2021
I feel I'm tongue tied when it comes to express the feeling of joy n happiness since the day one I took you into my hands. You are absolutely a great gift for us, keep rocking dear RAKing. We are and will be always with you, do whatever you want to. Best of luck my dear and blessings as always
యుద్ధం చెయ్యాల్సిన అవసరం లేదు 
... ప్రేమించు, మనిషిని మనిషిగా 
ర్యాంక్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు 
... జీవించు, ప్రతిక్షణం ఆనందంగా 
వ్యక్తులను గెలవనక్కరలేదు 
... ఎవరికీ తలవంచకు, దేనికీ లొంగకు 
ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదు 
... నీకు నచ్చినట్టుగా ఉండు 
ప్రపంచాన్ని జయించాల్సిన అవసరం లేదు 
... జయాపజయాలను పట్టించుకోకు 
నిన్ను చూసి మేము గర్వించాల్సిన అవసరం లేదు 
... నువ్వు ఆనందంగా ఉంటే చాలు 
జన్మదిన శుభాకాంక్షలు డియర్ రిషి ఆత్రేయ
Many happy returns dear RAKing
*** వంశీ & గాయత్రి

 
12 February 2021
మనం వ్యవస్థలో మార్పు రావాలి రావాలి అంటూ ఉంటాం కాని ఆ వ్యవస్థలో మనమూ భాగమనే విషయం మర్చిపోయి ఎవరో మార్పు తీసుకుని రావాలి అంటూ ఉంటాం. క్షమించాలి ఈ వాక్యాలు ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు ... అలాంటి వ్యవస్థలో నేను కూడా భాగస్వామినే ... ఇది మనందరి సామూహిక తప్పిదం. ప్రతి దేశానికి తనదైనటువంటి ఒక సంస్కృతి ఉంటుంది, దాన్ని గౌరవించాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో పాశ్చాత్యదేశాల సంస్కృతి, విపరీత ధోరణి, విశృంఖల స్వేచ్చాయుత ప్రవర్తన మనని ఆకర్షించటం వల్ల చాలా మార్పులు వచ్చాయి. ప్రతి దానిని పాశ్చాత్య దేశ ధోరణులతో పోల్చి చూసుకోవటం పరిపాటి ఐపోయింది. మన వ్యవస్థలో రావాల్సిన మార్పు అంటే ముందుగా ప్రజలలో రావాల్సిన మార్పు, ప్రజలలో మార్పు వస్తే రాజకీయ వ్యవస్థలో దాని అనుబంధ/ఆధారిత వ్యవస్థలలో కూడా మార్పు వస్తుంది. ఇంతకు ముందు ఎవరో పేర్కొన్నట్టు విద్యతో పాటు పరిసరాల ప్రభావం మన ప్రాంతంలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఇక్కడి వ్యవస్థ, జీవన విధానం, ధోరణులతో మన దేశాన్ని పోల్చి చూడటం మానుకోవాలి. మనం ఎంతగానో వ్యతిరేకిస్తున్న లేదా అసహ్యిన్చుకుంటున్న ఆ వ్యవస్థ విధానాల లోంచే మనమూ, మన తర్వాత మనకంటే ఉన్నత స్థాయికి చేరుకున్న వారు వచ్చారు, వస్తున్నారు, రాబోతున్నారు. మన విధానాలను సమీక్షించుకోవడం/విమర్సిన్చుకోవడం వరకు సరే కాని ఇతర దేశాలతో పోల్చుకునే న్యూనతా భావనలు వద్దు. 'దేశమంటే మట్టి కాదోయ్ ... దేశమంటే మనుషులోయ్'.
*** వంశీ కలుగోట్ల ✍️🤘

12 February 2021
మంచి చెడులనేవి వాటిని విశ్లేషించే వ్యక్తియొక్క వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి ఉంటాయి ... ఈనాటి ఆధునిక మీడియా ప్రభావిత ప్రపంచంలో రెండు పార్శ్వాలు మాత్రమె ఉన్నాయి 'మనకు నచ్చినవి' మరియు 'మనకు నచ్చనివి'. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, మంచి చెడులు గట్రా అన్ని ఈ రెండు అభిప్రాయలవల్లనే నిర్ణయింపబడతాయి తప్ప ధర్మ/చట్ట/న్యాయ సూత్రాలననుసరించి కాదు.
*** వంశీ కలుగోట్ల ✍️🤘

· 
11 February 2021
వేధింపబడే వాడు
పోరాడేవాడు
అనుభవించేవాడు
స్థానాలు మారుతారు
రాజ్యభావన మాత్రం మారదు
అందుకే
ఇపుడు తనదని విఱ్ఱవీగే వాడిని చూసి
రాజ్యం నవ్వుతూనే ఉంటుంది  
*** వంశీ కలుగోట్ల ✍️🤘


 
11 February 2021
సింపుల్ గా ఉన్నంత మాత్రాన గాంధీ కాలేరు
అన్నీ విప్పేసినంత మాత్రాన వేమన కాలేరు
*** వంశీ కలుగోట్ల ✍️🤘

10 February 2021
రాముడికి ముందైనా, తరువాతైనా ఎవరూ తమ సొంత సొమ్ములతో ప్రజలను పాలించలేదు. రాజుల సంపద అంతా ప్రజల కష్టమే. రాజుల భోగాల వెనుక ఉంది సామాన్యుల స్వేదాలే. రాజుల విజయాల కోసం పోయేది సైనికుల ప్రాణాలే. కాబట్టి నచ్చితే, ఎన్నుకోండి లేకపోతే మానెయ్యండి అంతే కానీ - వాళ్ళేమన్నా సొంత డబ్బులతో చేశారా అని అనకండి. అధికారం అన్నది పాలించడానికే కానీ సేవ చేయడానికి కాదు, ఎవరూ సేవ చేయరు కూడా. 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

10 February 2021
జెండా పట్టుకుని ఊరేగుతున్న వాడికి 
జనం వెతల గురించి ఏం తెలుస్తుంది?
నాయకుడు చెప్పిందే వేదం అనుకునేవాడికి 
వాస్తవాలు అర్థం చేసుకునే ఓపిక ఎక్కడుంటుంది?
కళ్ళముందు కనబడే సత్యాలను కూడా 
రంగుటద్దాలలో నుండి చూసేవాడికి 
పతనమవుతున్న పరిస్థితులు ఎలా తెలుస్తాయి?
*
కండువా వేసుకుని ఏది చెప్పినా సరే 
తలూపే గొఱ్ఱెలుంటాయి 
జెండాలు ఎగరేసి ఏది మాట్లాడినా 
ఉప్పొంగే గుండెలుంటాయి
కులం/మతం పేరుతో ఏది చేసినా 
సమర్థించే మూర్ఖులంటారు 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

9 February 2021
నువ్వు చేసిన ఏదైనా పనిని పదిమంది బాగుందన్నారంటే, దాని అర్థం అది ఆ పదిమందికి నచ్చిందని తప్పించి నిజంగా బాగుందని కాకపోవచ్చు, బాగుండచ్చేమో అంతే. పదిమంది నచ్చలేదని అన్నా కూడా అంతే.
*** వంశీ కలుగోట్ల ✍️🤘

5 February 2021
లక్ష్యాలు ఇంకా దూరంగానే ఉన్నాయి 
ప్రతి అడుగులో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి 
మనుషులు, పరిస్థితులు సమస్య ఏదైతేనేం 
... కానీ ఎక్కడా, ఎపుడూ పోరాటం ఆపలేదు 
ఇపుడూ, ఇకమీదట కూడా పోరాటం ఆగదు 
***  వంశీ కలుగోట్ల ✍️🤘

· 
4 February 2021
నూటికి తొంబై శాతంకి పైగా మంది చేసేపనికి, వారి అభిరుచులు/వ్యక్తిత్వం వంటివాటికి సంబంధం ఉండదు. రిహానా, మియా మల్కోవా మాత్రమే కాదు మనమందరమూ ఇందుకు మినహాయింపు కాదు. కాబట్టి ఏదైనా అంశంపై స్పందించాలంటే ఆ అంశంలో నిష్ణాతులై ఉండాల్సిన పనిలేదు, స్పందించే హృదయం ఉంటే చాలు. కాదు కూడదు అంటారా - అలా అంటే రాజకీయనాయకులు, ఉద్యోగులు, సామాన్యులు అనగా రైతులు కానివారెవరూ రైతుల సమస్యల పట్ల మాట్లాడకూడదు, మహిళలు కానివారెవరూ మహిళల సమస్యలపట్ల స్పందించకూడదు, పిల్లలు కానివారెవరూ పిల్లల సమస్యల పట్ల స్పందించకూడదు, క్రీడాకారులు కానివారెవరూ క్రీడాకారుల సమస్యల పట్ల స్పందించకూడదు, పాలకులు కానివారెవరూ పాలకుల గురించి మాట్లాడకూడదు ... రేపటిరోజున మనం రాజకీయాల గురించి, అవినీతి గురించి మాట్లాడితే అపుడు వాళ్ళు 'మీరేమన్నా రాజకీయ నాయకులా లేక అవినీతిపరులా, నోర్మూసుకోండి' అంటే తలకాయ యాడ బెట్టుకుంటారు? అవతలి వాళ్ళ విమర్శ సరికాదనిపిస్తే ఎందుకు కాదో చెప్పొచ్చు కానీ పోర్న్ స్టార్ కాబట్టి, సింగర్ కాబట్టి నువ్వు దీని గురించి మాట్లాడొద్దు అనడం సరికాదు. 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

 
4 February 2021
సచిన్ ట్వీట్ సరి కాదు, అలాగని ఆ ట్వీట్ మరీ దారుణమూ కాదు. ఒక సగటు భారతీయుడిగా లేదా తన దేశాన్ని అభిమానించే వ్యక్తిగా అతడు విదేశీయులను 'మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి' అని సున్నితంగా చెప్పాడు. అంతమాత్రాన అతడిని ఒక గాటన కట్టి, విమర్శించడం అంటే - అతడిని బలవంతంగా అవతలివైపుకు తోస్తున్నట్టు. 

· 
3 February 2021
మహాభారత యుద్ధంలో భీష్ముడిని ఎదుర్కొనే సత్తా లేక పాండవులు శిఖండిని అడ్డు పెట్టుకుంటారు. తద్వారా భీష్ముడిని గాయపరచి యుద్ధరంగం నుండి తప్పిస్తారు (అంటే భీష్ముడికి ఇచ్చామరణం అవకాశం ఉంది కాబట్టి). ఇపుడు సామాజిక మాధ్యమాలలో ఫేక్ మరియు విచిత్ర పేర్లతో ఉండే కొన్ని ఐడిలతో బూతులతో రెచ్చిపోయేవారిని చూసి శిఖండి ఉదంతం గుర్తొచ్చింది అంతే 😉 అసలు పేర్లు కాకుండా అలా విచిత్ర పేర్లతో ఉండే ఐడీలు చాలావరకూ అసలు పేరుతో డిగ్నిఫైడ్ తరహాలో ఉండేవారి ఫేక్ ఐడీలు అని అభిజ్ఞవర్గాల భోగట్టా 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

3 February 2021
రాష్ట్రానికి/దేశానికి ఇప్పుడు నాయకులకంటే ఎక్కువగా సమర్థులైన, బాధ్యతాయుత పౌరుల అవసరమే ఎక్కువగా ఉంది. ఆశావహ దృక్ఫథం నుండి ఆచరణాత్మక దృక్పథం వైపు ప్రజల ఆలోచనా సరళి మారనంతవరకూ రాజకీయనాయకుల అధికార ఆటలో వారు పావులుగా ఉండవలసిందే 🤷🤦
*** వంశీ కలుగోట్ల ✍️🤘

 
1 February 2021
అందరికీ భయాలుంటాయి
కానీ ఒక్క క్షణపు ఆలోచన
... కాసింత ధైర్యం
కొందరిని బ్రతుకువైపు నడిపిస్తుంది
మరికొందరిని చావువైపుకు తోస్తుంది
బ్రతికేవాడిది ... చావలేని భయం 
చచ్చేవాడిది ... బ్రతకలేని భయం  
*** వంశీ కలుగోట్ల ✍️🤘

 
1 February 2021
వంశీ కలుగోట్ల // ... వాడు - నేను //
*******************************
వాడు: ఏరా నువ్వు రాసేది జనాలకు నచ్చుతుందో, నచ్చదో పట్టించుకోకుండా రాసుకుంటూ పోతావా? ఎందుకురా ఊరికే టైం వేస్ట్ యవ్వారాలు? 
నేను: ఒరేయ్ ఇపుడూ పెళ్ళయ్యాక పిల్లల్ని కంటారు. అదేదో జనాలు తమ పిల్లల్ని మెచ్చుకుంటారనో, ఆడిస్తారనో కనరు కదా. నా రాతలూ అంతేరా. నచ్చినోళ్ళకు నచ్చుతాయి, నచ్చనోళ్ళకు నచ్చవు. 
వాడు: ఓహో ... మరి ఆడామగా కలిస్తే పిల్లలు పుడతారు. నీ రాతలెలా పుడతాయిరా మరి? 
నేను: భావోద్వేగాలతో ఆలోచనలు రమించడం ద్వారా నా రాతలు పుడతాయిరా 😉
వాడు: నిన్ను అడిగాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. 
నేను: కాస్త గట్టిగా కొట్టుకోవోయ్, కనీసం రెండైనా పళ్ళు రాలాలి. నాకు తెలిసిన డెంటిస్ట్ ఒకడున్నాడు - అసలే ఈ మధ్య వాడికి బిజినెస్ సరిగా నడవట్లేదు 😉😂
వాడు: 🙏🏃
 
31 January 2021
అన్వేషించుకుంటూ పొతే 
నిజాలు తెలుస్తాయనుకుంటున్నావేమో 
అన్నిటికంటే ముందు 
నువ్వేమీ కాదని తెలుసుకోవాల్సి వస్తుంది
***  వంశీ కలుగోట్ల ✍️🤘
 
30 January 2021
భక్తుడు: స్వామీ భోగి అనగా ఎవరు? 
స్వామి: నాయనా భోగి అనగా అధరాల్లో అమృతాన్ని వెతుక్కునేవాడు 
భక్తుడు: మరి యోగి అనగా ఎవరు స్వామీ 
స్వామి: యోగి అనగా ఆలోచనల్లో, వాటిని ఆచరించడంలో అమృతాన్ని వెతుక్కునేవాడు నాయనా 
భక్తుడు: బాగా చెప్పారు స్వామీ 
స్వామి: నువ్వు అడక్కపోయినా ఇంకోటి చెప్తా నాయనా. అధరాల్లోనూ, ఆలోచనల్లోనూ, ఆచరణలోనూ అమృతాన్ని వెతుక్కునేవాడిని సంసారి అంటారు 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

29 January 2021
వంశీ కలుగోట్ల // ... నడుం వరకూ మనుషులం //
******************************************
తన గురించి కవిత్వం రాయమని అడిగింది ఆమె
ఒంపుసొంపులు గురించి వయ్యారాల సొగసుల గురించీ
కవితలల్లు దామని దేహం చూపమని అడిగాను ఆమెను

ఆమె నగ్నత్వంలో ఒంపుసొంపులతో కూడిన సౌందర్యం కన్నా
గాయాల మచ్చలే ఎక్కువగా కనబడ్డాయి 
ఆ మచ్చలేంటని అడిగాను
ఆ మచ్చల్లో ఎపుడో ఒకసారి గుచ్చుకుని
గాయం చేసిన నీ ఆకలి చూపులు కూడా ఉంటాయి చూసుకో, అంది ఆమె

గాయాలను మోస్తూ ముసుగు తీసేసిన సమాజానికి
అద్దంలా నిలబడింది కాయితాన్ని విసిరేస్తూ మోకరిల్లాను కవిత్వం రాయలేనంటూ

అయినా, తాను గాయాల్ని మోయడం కన్నా 
తను చెప్పిన నిజాల్నినేను మోయడం ఇంకా కష్టం
అయినా, ఇంకా కొత్త గాయాలు చేస్తూనే ఉంటానేమో
నేనింకా మగవాడినే కదా

మనిషినెప్పుడవుతానో అని ఆమె ఎదురు చూస్తూనే ఉంటుంది
కానీ, మేమంతా నడుం వరకూ మనుషులం
నడుం క్రిందనుండి కోరికలకు పుట్టిన మృగాలం

28 January 2021
వంశీ కలుగోట్ల // ... తెలుసుకో //
****************************
కలల్ని పండించుకోవాలని 
పొలాల్ని భవనాలు చేస్తున్నావు 
... నీకు తెలుసా 
అవి కేవలం పొలాలు కావు 
కొందరి బతుకులు 
నీ కల ఖరీదు కొన్ని జీవితాలు 

తలుపులు మూసేస్తూ  
సమస్యలను తోసేశాననుకుంటున్నావేమో 
అవకాశాలను ఆపేస్తున్నావు 

జెండాలు మోయకపోతే 
పక్కనబెడతారని భయపడుతున్నావేమో 
నువ్వొక బోయీవి అంతే 

అన్వేషించుకుంటూ పొతే 
నిజాలు తెలుస్తాయనుకుంటున్నావేమో 
అన్నిటికంటే ముందు 
నువ్వేమీ కాదని తెలుసుకోవాల్సి వస్తుంది.


28 January 2021
కాలం కరిగిపోతుంది 
నీ ప్రేమ కూడా అంతేనా 
అడిగింది ఆమె 
కాలంతో పాటు 
వయసు పెరుగుతుంది 
కానీ, తగ్గదు కదా 
అన్నాను నేను 😉🥰
*** వంశీ కలుగోట్ల ✍️

27 January 2021
Leadership at onetime meant muscles ... today it means geting along with people
--- Mahatma Gandhi
 
26 January 2021
ఎవరో మహానుభావుడు చెప్పాడట!
"పుస్తకాలు  వీధుల్లోనూ 
చెప్పులు అద్దాల అంగడి లోనూ 
అమ్మే రోజులు వచ్చిన నాడు 
జనం కళ్ళు తెరవడానికి 
జ్ఞానం కంటే చెప్పులే అవసరం" 
అని!

26 Jan 2021 
దేశాన్ని కాపాడటమంటే 
సైనికుల బాధ్యత అనుకునే బ్లడీ ఫూల్ 
శాంతిభద్రతల పరిరక్షణ అంటే 
పోలీసుల బాధ్యత అనుకునే ఇడియట్
రాజ్యాంగం అంటే హక్కులు మాత్రమే అనుకుని 
బాధ్యతలు మరచిపోతున్న ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో
నీకు, నీలాంటి వాళ్ళు అందరికీ  
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
I too love my India 🙏
*** వంశీ కలుగోట్ల 🤘✍
#పాపో


25 January 2021
ముక్కలుగా విడిపోయేముందు 
కలిపి ఉంచబడిన దేహంగా ఉంటాను 
దేహంగా మారకముందు 
మాలిన్యాలంటని ఆత్మగా ఉంటాను 
పెదవిపై నవ్వుగా పూయకముందు 
బాధను దిగమింగే జోకర్ గా ఉంటాను 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

25 Jan 2021
ఏవో కొన్ని అక్షరాలు రాసి 
ఏదో ఒక గోడ మీద పడేస్తే 
ఏదో గొప్ప విషయం సాధించినట్టేనా
అక్షరాలు అలా గోడమీద 
ఊరికే పడి ఉండవు 
మనిషన్నోడిని కదిలిస్తాయి 
చలనం రాకపోతే ఆ తప్పు 
అక్షరాలదో, రాతగాడిదో కాదు 
జడత్వం వదిలించుకోని నీది
*** వంశీ కలుగోట్ల ✍️🤘

24 Jan 2021
మౌనం గా వుండు
ఎదుటివాడు నిన్ను వెధవనుకుంటే
నవ్వేసెయ్ ...
మాట్లాడి, వాడు అనుకున్నదాన్ని
ఋజువు చేసే తీరాలా?
-అబ్రహం లింకన్

23 Jan 2021
'డి కంపెనీ' టీజర్ రిలీజ్ సందర్భంగా వర్మ, దావూద్ ఇబ్రహీం విజన్ ని బిల్ గేట్స్ విజన్ తో పోల్చాడు. ఎలాగూ వర్మకు నిజాలతో పని లేదు, తనకు నచ్చినట్టు అర్థం చేసుకోవడం, ఆ అర్థం చేసుకున్నదాన్ని ఎఫెక్టివ్ గా తియ్యడం అంతే. దావూద్ వర్క్ స్ట్రీమ్ లో విజన్ కంటే బ్రెవిటీ ముఖ్యం. బిల్ గేట్స్ వర్క్ ఏరియా లో బ్రెవిటీ కంటే విజన్ ముఖ్యం. 
మొదటి గొఱ్ఱెను ప్రభావితం చేయడమే మనం చేయాల్సింది, తరువాత మమమేం చెయ్యాల్సిన పని లేదు - ఎందుకంటే మిగతా గొఱ్ఱెలు ఆ మొదటి గొఱ్ఱెను ఫాలో అవుతాయి. అందుకే ఇపుడు వర్మ ఏమీ చేయడం లేదు - అయినా గొఱ్ఱెలు ఫాలో అవుతాయి. దట్స్ ది బ్యూటీ యు నో 😉😂
#తుపుక్ 
#RGV
*** వంశీ కలుగోట్ల ✍️🤘

23 Jan 2021
నాతో నేను - 19
*
"నీ చుట్టూ ఉన్నవారిలో, నీ అనుకునే వారిలో చాలామంది నువ్వనుకునేలా ఉండరు. నీ ముందు ఒకలా, నీ వెనుక ఒకలా ఉంటారు. నీ గురించి నీ వెనుక వేరేలా మాట్లాడతారు. మోసం చేస్తారు" అని చాలామంది చెప్పారు. వారికి తెలీని విషయం ఏంటంటే, నాకు ఆ విషయం తెలుసని. వారు ఇపుడు తెలుసుకుంటున్నారేమో, కానీ నాకు ఎప్పటినుండో తెలుసు. మరో ముఖ్య విషయం ఏంటంటే వారు కూడా అలానే ప్రవర్తిస్తుంటారని నాకు తెలుసన్న విషయం వారికి బహుశా తెలీకపోవచ్చు. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే దాహం తీర్చే నీరే, వరదై ఉసురు తీయొచ్చు ... ఉప్పెనంత విధ్వంసాన్ని నిశ్శబ్దంగా లోలోపల మోస్తున్న సముద్రం శాంతగంభీరంగానే ఉంటుంది
అలలపైన ఆడుకో
... పరవాలేదు
కానీ, అలుసుగా తీసుకోకు
ఆ అలల వెనుక
సముద్రగర్భంలో
ఉప్పెన దాగి ఉంటుందని
... తెలుసుకో
*** వంశీ కలుగోట్ల ✍️🤘

23 Jan 2021
నాతో నేను - 19
*
"నీ చుట్టూ ఉన్నవారిలో, నీ అనుకునే వారిలో చాలామంది నువ్వనుకునేలా ఉండరు. నీ ముందు ఒకలా, నీ వెనుక ఒకలా ఉంటారు. నీ గురించి నీ వెనుక వేరేలా మాట్లాడతారు. మోసం చేస్తారు" అని చాలామంది చెప్పారు. వారికి తెలీని విషయం ఏంటంటే, నాకు ఆ విషయం తెలుసని. వారు ఇపుడు తెలుసుకుంటున్నారేమో, కానీ నాకు ఎప్పటినుండో తెలుసు. మరో ముఖ్య విషయం ఏంటంటే వారు కూడా అలానే ప్రవర్తిస్తుంటారని నాకు తెలుసన్న విషయం వారికి బహుశా తెలీకపోవచ్చు. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే దాహం తీర్చే నీరే, వరదై ఉసురు తీయొచ్చు ... ఉప్పెనంత విధ్వంసాన్ని నిశ్శబ్దంగా లోలోపల మోస్తున్న సముద్రం శాంతగంభీరంగానే ఉంటుంది
అలలపైన ఆడుకో
... పరవాలేదు
కానీ, అలుసుగా తీసుకోకు
ఆ అలల వెనుక
సముద్రగర్భంలో
ఉప్పెన దాగి ఉంటుందని
... తెలుసుకో
*** వంశీ కలుగోట్ల ✍️🤘

22 Jan 2021
భారతదేశ రాజ్యాంగం ప్రకారం మన దేశంలో రాజ్యాంగబద్ధ పదవులలో ఏ మతం, కులం వారైనా పోటీ చేయవచ్చు. గెలుపొందితే ఆయా పదవులను చేపట్టవచ్చు. రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్నవారిని కుల లేదా మత ప్రాతిపదికన ప్రస్తావించడం శిక్షార్హమే అనుకుంటాను. ప్రజలచేత ఎన్నుకోబడ్డవారు ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అవుతారు కానీ హిందూ ముఖ్యమంత్రి, క్రైస్తవ ముఖ్యమంత్రి అంటూ ఉండరు. అనుభవమా ఆకుకూరకట్టా, ఆ అనుభావమంతా మడిచి ఎక్కడైనా పెట్టుకోమనండి. వయసు పెరిగేకొద్దీ విజ్ఞత పెరగాలి. కొన్ని బతుకులను థూ అని చీదరించుకున్నా, సిగ్గుండదు ... 
#తుపుక్ 
*** వంశీ కలుగోట్ల ✍️🤘

22 Jan 2021
ప్రపంచాన్ని జయించాలని 
బయల్దేరిన పథికుడా ... ఆరడుగుల నేలలో 
ఇంకిపోయిన చరిత్రలను అడుగు 
ప్రపంచమంటే ఏమిటో తెలుస్తుంది
*** వంశీ కలుగోట్ల ✍️🤘

21 Jan 2021
'కోపం వచ్చినపుడు, వెంటనే మాట్లాడకుండా ఓ పది అంకెలు లెక్కపెట్టి తరువాత మాట్లాడమని'. ఎందుకు అంటే ఆవేశం మన ఆలోచనను చంపేస్తుంది. మనం మాట్లాడేముందు ఏం మాట్లాడుతున్నామని ఆలోచించుకుని మాట్లాడటమే కాదు; ఎదుటివారు ఏం మాట్లాడారు అన్నది అర్థం/ఆకళింపు చేసుకోవటానికి కొద్దిపాటి సమయం తీసుకోవటంలో తప్పేమీ లేదు. ఇది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది కాదు, కాకూడదు. ఆలోచనా తీరుకు కూడా దీనిని అన్వయించుకోవాలి. 
👍

19 Jan 2021
నాతో నేను - 18
*
ప్రశ్నలు పుట్టుకొస్తూనే ఉంటాయి
పరిస్థితులు వెంటాడుతూనే ఉంటాయి
పోరాడేవాడికి యుద్ధాలే తప్పించి
... రాజ్యాలుండవు
నిరంతర యుద్ధం జరిపే యోధుడవై గమించు
నిలకడ నీ తత్త్వం చేసుకోకు
చంచలం లక్షణంగా అలవాటు చేసుకోకు
... నువ్వొక గమనం
... నువ్వొక చైతన్యం
*** వంశీ కలుగోట్ల ✍️🤘

19 Jan 2021
గుడి బయట బిచ్చగాడికి ఒక్క రూపాయి దానం చేయ్యానికి 'బానే ఉన్నావుగా ఏదైనా పని చేస్కొని బతకోచ్చుగా' అని హితబోధ చేసే మనమే గుడి లోపల హుండీ లో రూ. 100/- వేసి పుణ్యం ప్రసాదించమని వేడుకోవడమేనేమో మానవత్వమంటే
*** వంశీ కలుగోట్ల ✍️🤘

16 Jan 2021
దేశంలో సమస్యలున్నాయి 
ప్రశ్నించినవాడు  ... నాయకుడయ్యాడు 
పోరాడినవాడు... విప్లవకారుడయ్యాడు 
పరిష్కరింపబడుతాయని నమ్మినవాడు... ఓటరు అయ్యాడు 

దేశంలో సమస్యలు ... ఇంకా అలానే ఉన్నాయి 
రాత్రి చీకటిలా, పగటి ఎండలా
*** వంశీ కలుగోట్ల ✍🤘

Comments

Popular posts from this blog

నా విజయ రహస్యం

Gandhi- My Experiments with Truth (ఆత్మకథ లేక సత్యశోధన)

Sri Krishna Seek from "Maha Bharatam" Serial