Posts

Showing posts with the label Semi Spiritual Subjects

ప్రార్ధన 🛐 విశ్వాసం 😇 సహాయం🙏

 ప్రార్ధన 🛐 విశ్వాసం 😇 సహాయం🙏 ఒక పేద ముసలావిడ పది ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ తలిదండ్రులు లేని తన మనవడి ఆకలితీర్చేది!. అనుకోని కరోనా సంఘటనలు వల్ల ప్రభుత్వం నిర్బంధం విధించింది. ఆ నిర్బంధం వల్ల ఇంటి తలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితుల్లో, ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొర పెట్టు కోవడానికి మొకరిల్లి ప్రార్థన చేస్తోంది. ప్రార్థనలో ఆవిడ దేవునితో  " దేవా ..! ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు కాకితో ఆహారాన్ని సమకూర్చావు. అలాగే నా మనవడి ఆకలి కూడా తీర్చగలవని ప్రాధేయ పడుతున్నాను" అన్నది. ఆ మాట విన్న తన మనవడు కాకి ఆహారాన్ని తెస్తుందని నమ్మి , కాకి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి లేవని, వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు. అయితే కిటికీ పక్కనే కాపాలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపుమీద కొట్టి లోపలికి తొంగిచూశాడు. లోపల ఓ పసి పిల్లవాడు బిక్క మోహం వేసుకుని అతనివంక బెదురుగా చూస్తుంటే ..! ఆ పోలీసు "ఏరా? తలుపెందుకు తీశావ్ ..!?" అన్నాడు. ఆ పిల్లవాడు "మా బామ్మ దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు కాకితో ఆహారం పంపుతాడని అంటుంది" అన్నాడు. అందుకే కి...

అంతర్ముఖుడు కావాలి

ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.  ప్రతి రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు. ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది...... బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు. తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. ఆ భక్తుడు సరేనన్నాడు.  ఆ ఘడియ రానే వచ్చింది. బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు. ఆశ్చర్యం ......! దాని నుండి నిధి బయటపడింది. వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి. అవన్నీ అతడి సొంతమయ్యాయి. మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు. కానీ, ఒక సందేహం అతడిని పీడించింది. నిధి మీదే...