ప్రార్ధన 🛐 విశ్వాసం 😇 సహాయం🙏

 ప్రార్ధన 🛐 విశ్వాసం 😇 సహాయం🙏

ఒక పేద ముసలావిడ పది ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ తలిదండ్రులు లేని తన మనవడి ఆకలితీర్చేది!. అనుకోని కరోనా సంఘటనలు వల్ల ప్రభుత్వం నిర్బంధం విధించింది.

ఆ నిర్బంధం వల్ల ఇంటి తలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితుల్లో, ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొర పెట్టు కోవడానికి మొకరిల్లి ప్రార్థన చేస్తోంది. ప్రార్థనలో ఆవిడ దేవునితో  " దేవా ..! ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు కాకితో ఆహారాన్ని సమకూర్చావు. అలాగే నా మనవడి ఆకలి కూడా తీర్చగలవని ప్రాధేయ పడుతున్నాను" అన్నది.

ఆ మాట విన్న తన మనవడు కాకి ఆహారాన్ని తెస్తుందని నమ్మి , కాకి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి లేవని, వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు. అయితే కిటికీ పక్కనే కాపాలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపుమీద కొట్టి లోపలికి తొంగిచూశాడు. లోపల ఓ పసి పిల్లవాడు బిక్క మోహం వేసుకుని అతనివంక బెదురుగా చూస్తుంటే ..! ఆ పోలీసు "ఏరా? తలుపెందుకు తీశావ్ ..!?" అన్నాడు. ఆ పిల్లవాడు "మా బామ్మ దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు కాకితో ఆహారం పంపుతాడని అంటుంది" అన్నాడు. అందుకే కిటికీ తలుపు తీసాను అన్నాడు.

అప్పుడా పోలీసు లోపల గదిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న ఓ ముసలావిడని చూసి ఆ పిల్ల వాడితో "ఆకలి వేస్తుందా " అని అడిగి "మీ బామ్మ చెప్పిన కాకిని నేనే ..! నువ్వు కిటికీ తలుపులు వేసుకుని లోపలే ఉండు. నేను మళ్ళీ వచ్చి తలుపు కొట్టినప్పుడు తియ్యి" అని చెప్పాడు. అతను ఒక మూసి ఉన్న పచారి కొట్టు తీయించి పప్పులు, ఉప్పులు, బియ్యం అన్నీ తీసుకుని ఆ రోజుకి తనకిచ్చిన భోజనాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లవాడి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపుకొట్టి అందించాడు. ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు ఆ #ఖాకీ ద్వారా ఆకలి తీర్చాడు. 

ఒకరిది ప్రార్థన ..!
ఇంకొకరిది విశ్వాసం ..!
మరొకరిది ప్రేమ పూరిత సహాయం ..!

#ప్రార్థన : ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా దేవుడు చేసిన మహా అద్భుతాలను గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ చేసిన ప్రార్థన ..!
#విశ్వాసం : ఆ చిన్న పిల్ల వాడు తన బామ్మ చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ తెరిచి మరీ వెతకడం ..!
#సహాయం : ఆ పిల్లవాడికి దేవుడు మీద ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపోయిన ఒక పోలీసు ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తన వంతు సహాయం చేయడం ..!
నిష్కల్మషమైన మన ప్రార్థనకు దేవుడు తప్పక  సమాధానమిస్తాడు అని చెప్పడానికి ఈ చిన్న యదార్థ సంఘటన చాలేమో కదూ ..!


Comments

Popular posts from this blog

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

UNO & It's Associations Declared Days

రామాయణ దృక్పథం