Sri Krishna Seek from "Maha Bharatam" Serial

నిర్ణయం

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అందరూ నేడు నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తులో సుఖపడాలి భవిష్యత్తు సురక్షితం కావాలి అనుకుని వాటికి నిర్ణయాలు ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. 

మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు భవిష్యత్తు కోసం తీసుకున్నవి కావా? 
ఎందుకు తీసుకోకూడదు? మీ జీవితాన్ని సరళంగా, సుఖమయంగా మార్చుకునే ప్రయత్నం చేసే అధికారం మీ అందరికి ఉంది. కానీ భవిష్యత్తు ఎవరికి తెలియనిది? కేవలం మీరు ఊహించుకోవచ్చు అంతే, అంటే మనం జీవితంలోని అన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ ఊహల ఆధారంగానే తీసుకుంటారు, అయితే నిర్ణయాలు తీసుకోవడానికి ఏదైనా ఇంకొక మార్గం లేదంటారా? ఆలోచించండి. 

సకల సుఖాలకు ఆధారం ధర్మమే, ఆ ధర్మం మనిషి హృదయంలో వహిస్తుంది, అందుకే ప్రతి నిర్ణయానికి ముందు మీరు మీ మనస్సులో అవశ్యం ఈ ప్రశ్నలు వేసుకోండి, ఈ నిర్ణయం స్వార్ధం నుండి జన్మించిందా, లేక ధర్మం నుంచా అని. ఇది సరిపోదంటారా, భవిష్యత్తుకు మారుగా, ధర్మం గురించి ఆలోచించడం వలన, భవిష్యత్తు అధిక సుఖమయం కాదంటారు. మీరే ఆలోచించండి

Comments

Popular posts from this blog

Gandhi- My Experiments with Truth (ఆత్మకథ లేక సత్యశోధన)

బెండమూరి లంక - వంశీకృష్ణ

Geeta Jayanti (Special)