Gandhiji/గాంధీజీ
©️ #ఈనాడు #భవ_భారతదేశం #DekhoApnaDesh #AzadiKaAmritMahotsav దక్షిణాఫ్రికా నుంచి వచ్చి భారత స్వాతంత్ర్య సమర పగ్గాలు చేపట్టిన గాంధీజీ అహింస, సత్యాగ్రహం అంటూ సరికొత్త ఆయుధాలను సంధించారు. ఆంగ్లేయులనే కాదు... చాలామంది భారతీయులనూ ఆయన భావజాలం. ఆశ్చర్యపర్చింది. ఈ పద్ధతుల్లో ఎలా తెల్లవారిని కట్టడి చేస్తామో అర్థం కాలేదు. తన ఆలోచనలను విడమర్చి... భారతావనికి కర్తవ్యబోధ చేసేందుకు పాత్రికేయుడి అవతారమెత్తారు గాంధీజీ! ఉద్యమంలో ఊపిరి సలపకుండా ఉన్నా... మూడు పత్రికలకు సంపాదకత్వం వహించటం విశేషం. స్వాతంత్య్ర్యోద్యమ సమయంలో బ్రిటిష్ సర్కారు తమకు వ్యతిరేకంగా రాసే పత్రికలను ముప్పుతిప్పలు పెట్టేది. 1919 రౌలత్ చట్టం వచ్చాకనైతే పత్రికారంగంపై బ్రిటిష్ సర్కారు దాష్టీకం అంతా ఇంతా కాదు. జాతీయవాద దృక్పథంతో వెలువడుతున్న 'ది బాంబే క్రానికల్'పై కక్ష పెంచుకుంది. బ్రిటన్కే చెందిన బి.జి. హార్నిమాన్ ఆ పత్రిక సంపాదకుడిగా ఉంటూ సర్కారును విమర్శించేవారు. తమ జాతివాడైన ఆయనకు కఠిన శిక్ష వేయలేక.... స్వదేశానికి పంపించిన బ్రిటిష్ ప్రభుత్వం... ఆ పత్రికను మూసేయించింది. ఆ పత్రిక నిర్వహణ బాధ్యతలను చూస్తున్న ఉమర్ సుభానీ, శంకర్లాల్ బ...