రామోజీ రావు ఈనాడు
రామోజీ రావు ఈనాడు అంటే సామాన్యుడి అక్షరం.. ఈనాడు అంటే కార్మిక కిరణం.. ఈనాడు అంటే విద్యాదీప్తి.. ఇలా ఒకటేంటి 'ఈనాడు'ను ఎన్ని రకాలుగా కీర్తించినా తక్కువే దాని వెనుక ఓ వ్యక్తి కృషి, తపన, పట్టుదల ఉన్నాయి.. ఆయనే రామోజీరావు (Ramoji rao). దినపత్రిక రావాలంటే మధ్యాహ్నం అయ్యే రోజుల్లో సూర్యోదయం కాక ముందే ఇంటి గుమ్మం ముందు దినపత్రిక అందించాలన్న ఆయన ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నదే ఈనాడు (Eenadu). నాటి నుంచి నేటి వరకు 'ఈనాడు' వేసిన ప్రతి అడుగూ సంచలనమే. తెలుగు జర్నలిజంలో తనకంటూ సంపాదకుడిగా ప్రత్యేక పేజీ లిఖించుకున్నారాయన. అందుకే ఆయనను 'మీడియా మొఘల్' అని కీర్తిస్తారు. ఆరంభమే సంచలనం: 'సూర్యోదయం తరువాత ఈనాడు పేపర్ బాయ్ వీధుల్లో కనిపించకూడదు'.. ఇది రామోజీరావు గీసిన గీత. పత్రిక పంపిణీలో ఎదురయ్యే సవాళ్లకు ఈనాడు తొలి ప్రస్థానమే సమాధానం. మరే పత్రికా లేని ఓ మారుమూల ప్రదేశంలో 1974 ఆగస్టు 10వ తేదీన పడ్డ తొలి అడుగు.. నేటికీ అనంతమై నిరంతరం, తరంతరంగా అలా సాగిపోతూనే ఉంది. దిన పత్రికల పంపిణీ వ్యవస్థకు 'ఈనాడు' వేసిన బాటే అన్ని పత్రికలకు దారిచూపింది. అప్పటి వరకు పత్రిక కావాలంటే...