Varma Values (వర్మ విషయాలు)
24 Mar 2021 స్వేచ్ఛ ని ఇచ్చి చూడు దాన్ని పొందడం కూడా తెలుస్తుంది. 08 Apr 2021 కవులకు కనికరం లేదు ఫేస్బుక్ లో ప్రశాంతత లేదు ఇక మిగిలింది ఫేస్బుక్ సన్యాసమే. 08 Mar 2022 అమ్మా .. తల్లిగా నీ ప్రేమ అపురూపం లోల్లి లో నిన్ను గెలవడం అసాధ్యం అన్నట్టు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 27 Mar 2022 నవ్వు కన్నా సిగ్గే నాణ్యమైనది 29 Mar 2022 నీకు అద్భుతంగా అనిపించింది. నీ వీపీ తనం కూడా కారణం కావచ్చు. పరిశీలించి చూసుకో .. 30 Mar 2022 జతగా నడిచిన దారుల్లో జ్ఞాపకాలు జర్నీ చేస్తుంటాయి 12 Apr 2022 నేనంటూ లేని ఈ లోకంలో.. నా ఉనికిని తెలియచేసే ఈ పుట్టక అంటే నాకు అసహ్యం 12 Apr 2022 ఆస్వాదించడానికి అనుభవించడానికి గల్లికి గోల్కొండ కి ఉన్నంత తేడా ఉంటుంది 8 May 2022 అద్భుతాన్ని వర్ణించే అవసరం లేదు అమ్మ ప్రేమ లాగా ... మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 8 May 2022 గూగుల్ కొటేషన్లు దొంగిలించగలవు గూగుల్ కవితలు దొంగిలించగలవు నా లైకుని దొంగిలించలేవు 22 May 2022 మనకి దేవుడి అవసరం ఉంది మేలు జరిగినప్పుడు మొక్కడానికి కీడు జరిగితే తిట్టడానికి . 10 Jun 2022 భయం బయోడేటా లో ఉండదు బ్లెడ్ పోతుంటే ఉంటది . 13 Jun 2022 నీతులు నిరోధులు వ్యక...