Varma Values (వర్మ విషయాలు)

24 Mar 2021
స్వేచ్ఛ ని ఇచ్చి చూడు దాన్ని పొందడం కూడా తెలుస్తుంది.

08 Apr 2021
కవులకు కనికరం లేదు
ఫేస్బుక్ లో ప్రశాంతత లేదు
ఇక మిగిలింది ఫేస్బుక్ సన్యాసమే.

08 Mar 2022
అమ్మా ..
తల్లిగా నీ ప్రేమ అపురూపం
లోల్లి లో నిన్ను గెలవడం అసాధ్యం
అన్నట్టు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

27 Mar 2022
నవ్వు కన్నా సిగ్గే నాణ్యమైనది

29 Mar 2022
నీకు అద్భుతంగా అనిపించింది. నీ వీపీ తనం కూడా కారణం కావచ్చు. పరిశీలించి చూసుకో ..

30 Mar 2022
జతగా నడిచిన దారుల్లో
జ్ఞాపకాలు జర్నీ చేస్తుంటాయి

12 Apr 2022
నేనంటూ లేని ఈ లోకంలో..
నా ఉనికిని తెలియచేసే ఈ పుట్టక అంటే
నాకు అసహ్యం

12 Apr 2022
ఆస్వాదించడానికి అనుభవించడానికి
గల్లికి గోల్కొండ కి ఉన్నంత తేడా ఉంటుంది

8 May 2022
అద్భుతాన్ని వర్ణించే అవసరం లేదు
అమ్మ ప్రేమ లాగా ...
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

8 May 2022
గూగుల్ కొటేషన్లు దొంగిలించగలవు
గూగుల్ కవితలు దొంగిలించగలవు
నా లైకుని దొంగిలించలేవు

22 May 2022
మనకి దేవుడి అవసరం ఉంది
మేలు జరిగినప్పుడు మొక్కడానికి
కీడు జరిగితే తిట్టడానికి .

10 Jun 2022
భయం బయోడేటా లో ఉండదు
బ్లెడ్ పోతుంటే ఉంటది .

13 Jun 2022
నీతులు నిరోధులు వ్యక్తిగతం ప్రదర్శించకూడదు పాటిస్తూ వాడేస్తూ ..

18 Jun 2022
జీవితాన్ని ఎడిట్ చేసుకునే వ్యక్తులు
హ్యాపీగా ఉంటారు .

20 Jun 2022
అన్ని కళల్లో గొప్ప కళ
ఆనందంగా జీవించడం .

25 Jun 2022
ఎఫైర్ లో ఫైర్ ఉంటది
టచ్ చేస్తే సుర్రుమంటది!

15 Aug 2022
పతాకాన్ని కాదు
పొరుగువాన్ని ప్రేమించు
పతాకం గర్వపడేలా

22 Aug 2022
సిగ్గు విడిచిన వాళ్లే
సిగ్గుందా అంటుంటారు
సిగ్గు లేకుండా....

25 Aug 2022
సంతోషించే క్షణాలు
జీవితాన్ని సార్ధకం చేస్తుంటాయి .

5 Sep 2022
మనిషిని మోసం చేయాలంటే
మనస్సాక్షి ని మర్డర్ చేయగలగాలి .

5 Sep 2022
హస్త కళలు
భావప్రాప్తిని కలిగిస్తాయి

12 Sep 2022
మీ దేవుడు వేరు
నా దేవుడు వేరు
నేను దేవుడికి వేరు

17 Sep 2022
వినేవాడు ఉంటే
వీపీ కూడా విశ్లేషకుడే ఇక్కడ

03 Oct 2022
కళ గుర్తిస్తేనే ...కళ

12 Oct 2022
మరణించడం గురించి తెలిస్తే
ఆస్వాదించడం తెలుస్తుంది .

15 Oct 2022
తెలుగు ఇండస్ట్రీలో
స్పష్టంగా నటన కనిపిస్తే స్టార్ హీరో
సహజంగా కనిపిస్తే విలన్

17 Oct 2022
భావోద్వేగాలను జయించిన వాడు
లోకాన్ని జయించిన వాడు

20 Oct 2022
మనకు స్క్రోల్ చేయడం ఎలాగో
పొలిటీషియన్స్ కి సిగ్గు అలాగా..

21 Oct 2022
మనం బాధపడే విషయంలో
మంది ప్రమేయం కంటే
మన ప్రమేయం ఎక్కువ

25 Oct 2022
ఒకరి ఇష్టాన్ని చంపడం
ఆ వ్యక్తిని మానసికంగా చంపడం కూడా...

28 Oct 2022
పరిపూర్ణమైన ప్రేమలో
ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు
ప్రేమ మాత్రమే ఉంటుంది

31 Oct 2022
డౌటే లేదబ్బా ఇందులో'
డ్యూటీ మానేసి
డేటా ఉపయోగించి
సంఘ సంస్కర్త కావచ్చు ఇక్కడ

6 Nov 2022
భర్త ఒక చెంప మీద కొట్టినప్పుడు
రెండు చెంపలు వాయించే స్త్రీ అంటే నాకెంతో గౌరవం

7 Nov 2022
భగవంతునికి కాలుతుందనే నా భక్తి ని fb లో ప్రదర్శించను నిజానికి భక్తి ఎక్కువే

09 Nov 2022
అదొక్క చెడ్డ పనేంటో తెలుసా
నేను చేసేవి అన్నీ మంచి పనులు అనుకోవడమే

13 Nov 2022
ఒకరు చూసిన అద్భుతాన్ని
మరొకరు చూసేలా చేసేది కెమెరా మాత్రమే

14 Nov 2022
మానసిక ఒత్తిడిని
మానసిక బాధని
మానసిక శక్తితోనే జయించగలం

15 Nov 2022
నరకస్తులయ్యారని అనలేం గనుక
స్వర్గస్తులయ్యారని అంటుంటాం
అంతా నరకానికే వెళ్లేది

16 Nov 2022
చావును కన్ఫామ్ చేసుకున్న
800 కోట్ల ప్రపంచ జనాభా

18 Nov 2022
దృష్టి పెడితే
దృశ్యం అద్భుతం కాదా.....

19 Nov 2022
దినానికి దినోత్సవానికి తేడా తెలియట్లేదే

23 Nov 2022
హ్యాపీగా ఉంటానికి
వీపీ అయితే చాలు
వివేకం అక్కర్లేదు .

26 Nov 2022
ప్రకృతి
సంగీతం
సాహిత్యం
స్త్రీ
వీటిని ఆస్వాదించడానికి
నీవో అద్భుతం అయి ఉండాలి

5 Dec 2022
ఓ వంద సంవత్సరాలు మనుష్యులు పిల్లల్ని కనకుండా ఉంటే చాలబ్బా భూమికి పట్టిన దరిద్రం వదిలిద్ది
సృష్టిలో అద్భుతం అనిపించేది ఒక్క సముద్రం

వర్మ

 👁️‍🗨️👌🔖♻️@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం

Comments

Popular posts from this blog

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

రామాయణ దృక్పథం

Geeta Jayanti (Special)