ఈశ్వరోవాచలు
30 Aug 2022 విజ్ఞానానికి కేంద్రం వెలుగు. చూడాలనుకుంటే కళ్ళు తెరువు. భరించలేననుకుంటే మూసెయ్. చీకటిని వదలలేని నీ అంధత్వానికి బాధ్యులెవరూ లేరిక్కడ. 30 Oct 2022 జీవం అంటే మరేవిటో కాదు. ఆహారం. ఒక జీవకణానికి మరో జీవకణం ఆహారమవడమే సృష్టి. ఆకలి కలగడం అంటే జీవకణాల కలయికని కోరుకోవడం. 🤗. చివరికి మనిషి శవాన్నికూడా పురుగులు ఆహారంగా స్వీకరిస్తాయి. అదే సృష్టి ధర్మం. మధ్యలో మనం ఊహించుకునేవన్నీ భ్రమలే. శాఖాహారం మాంసాహారం అనే ప్రత్యేక శాఖలేవి లేవు. అన్నీ సృష్టిధర్మాన్ని అనుసరించి జీవించేవే... ఐతే ఇన్ని వైవిధ్యాలుగల జీవులెలా సృష్టించబడుతున్నాయనేదే సృష్టి రహస్యం. మనం ఫలితం మాత్రమే చూడగలం. రహస్యాన్ని ఛేదించలేం. ఛేదించాలని ఉవ్విళ్ళూరేది శాస్త్రం. ఛేదించాలనే ఆలోచన కలగక ఆ రహస్యానికొక పేరు పెట్టుకుని సరిపుచ్చుకునేది విశ్వాసం. అంతే.. మరేంలేదు.🤗 21 December 2019 నాలో లేనిది నానుండి ఏదీ వెలువడదు. నా నుండి వెలువడాలంటే వెలువడాల్సినది నాలో ఉండనక్కరలేదు. కేవలం ఉన్నట్టు కనబడితే చాలు. ఇంతకీ ఏంచెప్పానో ఏంటో నాకే తెలియకుండా వెలువడింది..-- 02 Nov 2019 జాగరూకత" అంటే ఇంతే జరిగినవాటినుండి గ్రహించి జరుగుతున్...