ఆరుణిమలు (Aruna Majji)

 ArunaMajji May 25

బాధని బంధిస్తే
బరువై పోతుంది.

ArunaMajji Jun 4
అందమైన అమ్మాయిలంటే అబ్బాయిలకి ఇంట్రెస్ట్...
అర్థం కానీ అబ్బాయిలంటే అమ్మాయిలకి ఇంట్రెస్ట్..
ఏవిటో..

ArunaMajji Jun 4
స్వేచ్ఛ అనేది మన రక్షణని
హరించేదిగా ఉండకూడదు..
దానిని స్వేచ్ఛ కాదు
విచ్చలవిడి తనం అంటారు..

ArunaMajji Jul 10
ఎదుటివారి శరీరాన్ని చదివేసే కళ్ళు....మనసును మాత్రం చదవాలి అనుకోదు...
అలా అనుకుంటే శరీరాన్ని చదివే ప్రయత్నమే చేయవు..

ArunaMajji Jul 10
నీలో అసహనం కన్నా ప్రశ్నలను లేవనెత్తాలి...
ఆ గెలుపు వెనుక తన బలమేంటి
నీ బలహీనత ఏంటి అని..

ArunaMajji Jul 24
చిన్న చిన్న సంతోషాలు వెనుక
ఎనలేని ఆనందం దాగి ఉంటుంది..
వాటికి విలువ కట్టలేం
వాటిని వదులుకోలేము.

ArunaMajji Jul 29
లెక్కల్లో బ్రతికే వారికి
పరీక్షలు ఎక్కువ ఎదురౌతాయి..
నీ లెక్క
తప్పుతావో, లేదో
చూడటానికి..

ArunaMajji Aug 3
చేసిన తప్పును ప్రశ్నించు
తప్పుడు వ్యక్తిగా రుజువు చేయాలని
ప్రయత్నించకు...నువ్వే తప్పుగా కనిపిస్తావు..
ఎందుకంటే ఇక్కడ ఎవరు తప్పులు చేయనివారు లేరు కనుక..

ArunaMajji Aug 16
హే రామ్....... మీ కథ చూసి వచ్చినప్పుడు నుండి... మీ కథ లోనే ఉండిపోతే బాగుందును అనిపిస్తుంది ఏంటయ్యా....నీ కథలో‌ నేనో కనిపించని పాత్రనై పోయా తెలుసా 😍😍😍

ArunaMajji Nov 1
ఆదర్శాలు అక్షరాలలో ఇంకిపోతుంటాయి....ఆలోచనలు, అభిప్రాయాలు మాత్రం వాటికి విరుద్ధంగా పేరుకు పోతుంటాయి..

ArunaMajji Nov 1
కూర్చుని మాట్లాడుకుంటే అపోహలు తొలగిపోతాయి కానీ అభిప్రాయాలు మారిపోవు బెదరు..

ArunaMajji Nov 20
ఇంటి వైశాల్యం పెరిగే కొద్ది వ్యక్తుల మధ్య దూరం కూడా పెరుగుతుంది.... ఎంతగా అంటే కష్టం, సుఖం కూడా వారంతట వారు చెబితే కానీ తెలుసుకోలేనంతగా..

ArunaMajji· Nov 20
లోపాన్ని ఒకసారి చెబితే చాలు.... గుచ్చి గుచ్చి పదిసార్లు చెబితే దానిని కోపం అనుకుంటారు..

ArunaMajji Nov 21
అర్థం చేసుకునే వారికి కారణం చెబితే చాలు.... వివరణలు ఇవ్వక్కర్లేదు..

ArunaMajji Nov 26
బలహీనుడి బల ప్రదర్శనని తక్కువ అంచనా వేయకు.... సమరానికి సిద్ధం అనేది తన బలాన్ని పెంచుకోవడానికే...

ArunaMajji Nov 28
ఎవరికైనా కష్టం వస్తే నీకు మేము ఉన్నాము అంటారు....అదొక ధైర్యాన్ని ఇచ్చే మాట మాత్రమే కానీ....నేనున్న అని బాధ్యత మోసేది ఎవరో ఒకరు ఉంటారు...

ArunaMajji Nov 28
అభిప్రాయాలు ఎప్పుడు ఒకలానే ఉండవు పరిస్థితులు బట్టి మారతాయి....అభిప్రాయాలు మారినంత మాత్రాన వ్యక్తులు కూడా మారినట్లు కాదు..

ArunaMajji Dec 1
నిన్ను నువ్వు ఎలా పరిచయం చేసుకుంటే సమాజం అలాగే చూస్తుంది...

ArunaMajji Dec 2
ఆ కళ్ళల్లో కైపుని మాత్రమే కాంచింది లోకం....ఆ కనుల వెనుక ఉన్న సోకాన్ని చూడలేక పోయింది..
శృంగార సీమంతిని.. నా జీవన మందాకిని
నీ కనుసన్న సైయ్యాటలో.. నను జీవించనీ.. మరణించనీ (సిల్క్ స్మిత పాటే ఇది కూడా)

ArunaMajji Dec 4
ఆశలు ఎన్నున్న
ఆంక్షలు నిన్ను ఎగరనివ్వవు

ArunaMajji Dec 4
గొప్పోళ్ళకి తోడుగా గొప్పోళ్ళు
నిలబడతారు కానీ..
లేనోడికి తోడుగా లేనోడు
నిలబడడు..
అందుకే వాళ్ళు ఎదుగుతానే ఉంటారు..
వీళ్ళు ఎవరో వస్తారని ఎదురు చూస్తానే ఉంటారు..

ArunaMajji Dec 9
బాధ్యత తీసుకున్న వారు ఎవరైనా మన బంధువులు అవుతారు కానీ బంధం ఉన్న వారందరు కారు..

ArunaMajji Dec 9
దాచుకున్న జ్ఞాపకాల మీద
పేరుకున్న దూళిని చూస్తే అనిపిస్తుంది
కాలానికి చాలా తొందరని..
జ్ఞాపకాల దూళిని దులిపితే
మనసు కూడా తేలిక ఐపోతుంది..

ArunaMajji Dec 11
లోపం, లోటు అనేవి చూసే వారికి తేలికగా....అనుభవించే వారికి బరువుగా ఉంటాయి..

 👁️‍🗨️👌🔖♻️@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం

Comments

Popular posts from this blog

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

UNO & It's Associations Declared Days

రామాయణ దృక్పథం