పూజా ధర్మములు అర్ధాలు

పూజా ధర్మములు అర్ధాలు

🔯 పూజ :-పూర్వ జన్మ వాసనలను నశింపచేసేది. జన్మ మృత్యువులను లేకుండా చేసేది.సంపూర్ణ ఫలాన్నిచ్చేది.

🔯 అర్చన:- అభీష్ట ఫలాన్నిచ్చేది. చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది. దేవతలను సంతోషపెట్టేది.

🔯 జపం:- అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది. పర దేవతను సాక్షాత్కరింప చేసేది జపం. ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది.

🔯 స్తోత్రం:- నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది. సాధకుని తరింపజేసేది స్తోత్రం.

🔯 ధ్యానం:- ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది.

🔯 దీక్ష:- దివ్య భావాలను కల్గించేది. పాపాలను కడిగివేసేది. సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.

🔯 అభిషేకం :- అభిషేకం చేస్తే చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరతత్వాన్ని అందిస్తుంది.

🔯 మంత్రం:- తత్త్వం గురించి మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం. అఖండ శక్తిని ఇస్తుంది.

🔯 ఆసనం:- ఆత్మ సిద్ధి కల్గించేది. రోగాలను పోగొట్టేది. క్రొత్తసిద్ధిని లేదా నవ సిద్ధులను కల్గించేది ఆసనం.

🔯 తర్పణం:- పరివారంతో కూడిన పర తత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.

🔯 గంధం:- గంధంలో పరదేవత కొలువై ఉన్నారు. ”మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లీ”అని దేవతలంతా అమ్మవారిని కోరారు. అప్పుడు అమ్మవారు “మీరు గంధంలో కొలువై ఉందురుగాక” అని వరం ఇచ్చారు. అప్పటినుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది.

🔯 అక్షతలు:- కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి. పసుపు, కుంకుమ, నూకలు (విరిగిన బియ్యం) లేని మంచి బియ్యం కలిపి చేయాలి.

🔯 పుష్పం:- పుణ్యాన్ని వృద్ధి చేసి, పాపాన్ని పోగొట్టేది మంచి బుద్ధిని ఇచ్చేది. అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి. మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది. (ఈమధ్య పుష్పాలను చించి రేకలను విడదీసి వాడుతున్నారు. అలా చేయవద్దు. కాగా తొడిమలను తప్పకుండా తుంచి వేశాకే పుష్పాలను పూజలోవినియోగించాలి.

🔯 ధూపం:-చెడువాసనల వల్ల వచ్చు అనేకదోషాలను పోగొట్టేది. పరమానందాన్ని ప్రసాదించేది. ధూపంద్వారా చాలా మంచిజరుగుతుంది. ప్రేత,పిశాచాలు పారిపోతాయి.

🔯 దీపం:- సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది. అహంకారం లేకుండా చేసేది. పర తత్త్వాన్ని ప్రకాశింప చేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. పూజ గదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావం దగ్గరికి రాదు. “అగ్ని” శివుడి కుమారుడైన కుమారస్వామికి ప్రతీక.

🔯 నైవేద్యం:- మధుర పదార్థాలను నివేదన చేయుటయే నైవేద్యం.

🔯 ప్రసాదం:-భగవంతుడికి నివేదించిన నైవేద్యమే ప్రసాదం. ప్రకాశానందాలనిచ్చేది. సామరస్యాన్ని కల్గించేది. పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం. ప్రసాదం భగవదనుగ్రహ సంకేతం. అత్యంత పవిత్రమైన పదార్థం. ఏ రూపంలోని ప్రసాదాన్నైనా “ప్రసాదం” అని మాత్రమే వ్యవహరించాలి. ఇటీవల అందరూ ‘పులిహోర’, ‘కొబ్బరి’ అని అనడానికి అలవాటు పడ్డారు. అలా అనకూడదు. “పులిహోర ప్రసాదం”, “కొబ్బరి ప్రసాదం” అనవచ్చు.

🔯 వందనం:- అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం. చేతులు జోడించి కూడా వందనం చేయవచ్చు. సాష్టాంగ ప్రణామం అంటే వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకు తాకించి చేసే వందనం. ఈ సాష్టాంగ ప్రణామం పురుషులు మాత్రమే చేయాలి. ఇది స్త్రీలు చేయరాదు. స్త్రీలు మోకాళ్ళపై భగవంతుడికి వందనం చేయొచ్చు.

🔯 ఉద్వాసన:-దేవతలను, ఆవరణ దేవతలను పూజించి, పూజను ముగించడాన్ని ఉద్వాసనమని అంటారు. చివర్లో ప్రార్థన, దోష క్షమాపణ చెప్పి తీర్థ, ప్రసాదాలు స్వీకరించి స్వస్తి చెప్పి ఉద్వాసనచేయవలసి ఉంటుంది

 ఇవన్నీ పూజా ధర్మములు

పూజలు, హోమాలు,యాగములు,ప్రతిష్ఠలు, శాంతి పూజలు,జాతక దోష నివారణ పూజల గురించి తెలుసుకోవడానికి,చేసుకోవడానికి సంప్రదించండి

🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚
🕉️🚩కొండమడుగు శివ సుబ్రహ్మణ్య శర్మ🚩🕉️

Comments

Popular posts from this blog

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

UNO & It's Associations Declared Days

రామాయణ దృక్పథం