Enjoying Editions (సంతోషపరిచిన సంపాదకీయాలు).... is Bharghava Shyam's Collection with Editing or Keeping the same content... as "Awared Nice Bookmarks Share": 👁️🗨️👌🔖♻️, . And trying to manifest "Tranquil Resonative Eminent Expressions" -🌳
Srinagar Station
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
Ice Intensity
Cold ❄️ Climate
Venerable View
Srinagar Station
Pictures Source: Ministry of Railways, Government of India
నా విజయ రహస్యం "విశ్వమత మహాసభల సమావేశ జన సమూహాన్ని 'అమెరికా సోదరీ, సోదరులారా!' అని సంబోధించాను! అంతే! చెవులు చిల్లులు పడేలా రెండు నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో ఆ భవ్య భవనం మారుమ్రోగింది. ఆ తరువాతనే నేను ప్రసంగించడం ప్రారంభించాను. అది ముగియగానే ప్రగాఢ భావావేశంతో దాదాపు అలసిపోయి నా స్థానంలో అలాగే కూర్చుండి పోయాను, మరుసటి రోజు వార్తాపత్రికలన్నీ నా ప్రసంగమే సర్వశ్రేష్ఠమైనదని ఘోషించాయి, నా గురించి అమెరికా అంతటా తెలిసిపోయింది. 'వారందరూ అలా స్పందించడానికి కారణమేమిటా?' అని నీవు ఆశ్చర్యపడవచ్చు! నాకేదయినా అద్భుత శక్తి, సిద్ధి ఉండినవా? అని నీవు అబ్బురపడవచ్చు!... ఔను! నీకు ఆ రహస్యం చెప్పేస్తున్నాను. నాలో ఆ 'అద్భుత శక్తి' ఉండినది, ఉన్నదీ. అదేమిటంటే - నా జీవితంలో ఒక్కసారి కూడా కనీసం ఒక్క లైంగిక తలంపును, చెడు ఆలోచనను కూడా నా మనస్సులో ప్రవేశింపనీయలేదు. మనస్సుకు, నా ఆలోచనా శైలికి నేనే ప్రశిక్షణ ఇచ్చాను; మనిషి సాధారణంగా కామ చింతన చెడు సంపర్కంతో వృథా చేసుకొనే మానసిక శక్తుల్ని నేను ఊర్ధ్వముఖంగా ఉన్నత దిశలో ప్రవహింపజేశాను. తత్ఫలితంగా నా మనస్సు, మేధ, సంకల్పం ఎవ్వరూ, - ఏదీ ఆపలేని...
మోహన్ దాస్ కరమ్ చంద్ అనే సాధారణ వ్యక్తి సత్యమే మార్గంగా, సత్యమే ఆయుధంగా, సత్యమే వ్రతంగా మహాత్ముడిగా మారారు! 'నాకు సాధ్యమైంది. మీకూ సాధ్యమౌతుంది' అంటూ తన ఆత్మకథ ద్వారా మనల్ని సత్యశోధనకు ప్రోత్సహిస్తున్నారు గాంధీజీ. విలువల వాచకం! ఆత్మకథ లేక సత్యశోధన (మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్) .ఈ పుస్తకాన్ని గాంధీజీ 1925 ప్రాంతంలో గుజరాతీలో రాశారు. ఆతర్వాత దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఇప్పటికి ముద్రణలూ పునః ముద్రణలు వస్తున్నాయి. గురువులు శిష్యులకూ కన్నవారు పిల్లలకూ కానుకగా ఇస్తున్నారు. చదివితీరాల్సిన పుస్తకంగా రేపటి మేనేజర్లకు సిఫార్సు చేస్తున్నాయి బిజినెస్ స్కూళ్లు. ప్రపంచంలోని వంద అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంథాల జాబితాలోనూ స్థానం సంపాదించుకుంది. ఏటా రెండు లక్షల కాపీలు సునాయాసంగా అమ్ముడవుతున్నాయి. అన్ని భాషలూ కలిపి, ఇప్పటిదాకా యాభై లక్షల ప్రతులు విక్రయించినట్టు అంచనా మేనేజ్మెంట్, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం మార్కెట్లోకి ఎన్ని రకాల కొత్త పుస్తకాలు వస్తున్నా, 'టెస్ట్ సెల్లర్స్ జాబితాలో మహాత్ముని ఆత్మకథ. స్థానం మాత్రం చెక్కు చెదర లేదు. ఎందుకింత ఆదరణ! 'సత్యశోధన'లో ...
నిర్ణయం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అందరూ నేడు నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తులో సుఖపడాలి భవిష్యత్తు సురక్షితం కావాలి అనుకుని వాటికి నిర్ణయాలు ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు భవిష్యత్తు కోసం తీసుకున్నవి కావా? ఎందుకు తీసుకోకూడదు? మీ జీవితాన్ని సరళంగా, సుఖమయంగా మార్చుకునే ప్రయత్నం చేసే అధికారం మీ అందరికి ఉంది. కానీ భవిష్యత్తు ఎవరికి తెలియనిది? కేవలం మీరు ఊహించుకోవచ్చు అంతే, అంటే మనం జీవితంలోని అన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ ఊహల ఆధారంగానే తీసుకుంటారు, అయితే నిర్ణయాలు తీసుకోవడానికి ఏదైనా ఇంకొక మార్గం లేదంటారా? ఆలోచించండి. సకల సుఖాలకు ఆధారం ధర్మమే, ఆ ధర్మం మనిషి హృదయంలో వహిస్తుంది, అందుకే ప్రతి నిర్ణయానికి ముందు మీరు మీ మనస్సులో అవశ్యం ఈ ప్రశ్నలు వేసుకోండి, ఈ నిర్ణయం స్వార్ధం నుండి జన్మించిందా, లేక ధర్మం నుంచా అని. ఇది సరిపోదంటారా, భవిష్యత్తుకు మారుగా, ధర్మం గురించి ఆలోచించడం వలన, భవిష్యత్తు అధిక సుఖమయం కాదంటారు. మీరే ఆలోచించండి
Comments
Post a Comment