ప్రార్ధన 🛐 విశ్వాసం 😇 సహాయం🙏
ప్రార్ధన 🛐 విశ్వాసం 😇 సహాయం🙏 ఒక పేద ముసలావిడ పది ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ తలిదండ్రులు లేని తన మనవడి ఆకలితీర్చేది!. అనుకోని కరోనా సంఘటనలు వల్ల ప్రభుత్వం నిర్బంధం విధించింది. ఆ నిర్బంధం వల్ల ఇంటి తలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితుల్లో, ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొర పెట్టు కోవడానికి మొకరిల్లి ప్రార్థన చేస్తోంది. ప్రార్థనలో ఆవిడ దేవునితో " దేవా ..! ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు కాకితో ఆహారాన్ని సమకూర్చావు. అలాగే నా మనవడి ఆకలి కూడా తీర్చగలవని ప్రాధేయ పడుతున్నాను" అన్నది. ఆ మాట విన్న తన మనవడు కాకి ఆహారాన్ని తెస్తుందని నమ్మి , కాకి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి లేవని, వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు. అయితే కిటికీ పక్కనే కాపాలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపుమీద కొట్టి లోపలికి తొంగిచూశాడు. లోపల ఓ పసి పిల్లవాడు బిక్క మోహం వేసుకుని అతనివంక బెదురుగా చూస్తుంటే ..! ఆ పోలీసు "ఏరా? తలుపెందుకు తీశావ్ ..!?" అన్నాడు. ఆ పిల్లవాడు "మా బామ్మ దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు కాకితో ఆహారం పంపుతాడని అంటుంది" అన్నాడు. అందుకే కి...