Posts

Showing posts from March, 2025

Gandhi- My Experiments with Truth (ఆత్మకథ లేక సత్యశోధన)

Image
  మోహన్ దాస్ కరమ్ చంద్ అనే సాధారణ వ్యక్తి సత్యమే మార్గంగా, సత్యమే ఆయుధంగా, సత్యమే వ్రతంగా మహాత్ముడిగా మారారు! 'నాకు సాధ్యమైంది. మీకూ సాధ్యమౌతుంది' అంటూ తన ఆత్మకథ ద్వారా మనల్ని సత్యశోధనకు ప్రోత్సహిస్తున్నారు గాంధీజీ. విలువల వాచకం! ఆత్మకథ లేక సత్యశోధన (మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్) .ఈ పుస్తకాన్ని గాంధీజీ 1925 ప్రాంతంలో గుజరాతీలో రాశారు. ఆతర్వాత దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఇప్పటికి ముద్రణలూ పునః ముద్రణలు వస్తున్నాయి. గురువులు శిష్యులకూ కన్నవారు పిల్లలకూ కానుకగా ఇస్తున్నారు. చదివితీరాల్సిన పుస్తకంగా రేపటి మేనేజర్లకు సిఫార్సు చేస్తున్నాయి బిజినెస్ స్కూళ్లు. ప్రపంచంలోని వంద అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంథాల జాబితాలోనూ స్థానం సంపాదించుకుంది. ఏటా రెండు లక్షల కాపీలు సునాయాసంగా అమ్ముడవుతున్నాయి. అన్ని భాషలూ కలిపి, ఇప్పటిదాకా యాభై లక్షల ప్రతులు విక్రయించినట్టు అంచనా మేనేజ్మెంట్, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం మార్కెట్లోకి ఎన్ని రకాల కొత్త పుస్తకాలు వస్తున్నా, 'టెస్ట్ సెల్లర్స్ జాబితాలో మహాత్ముని ఆత్మకథ. స్థానం మాత్రం చెక్కు చెదర లేదు. ఎందుకింత ఆదరణ! 'సత్యశోధన'లో ...

Black Money "నల్ల ధనం"

Image
  అవినీతి ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ "నల్ల ధనం" సూపర్ హిట్టు సినిమాలకు అవసరమైన హంగులన్నీ దీన్లో ఉన్నాయి. స్విట్జర్లాండ్ సెట్టింగులున్నాయి. మాఫియా గ్యాంగులున్నాయి. పొలిటికల్ పంచ్ డైలాగులున్నాయి. సామాన్యుడి సెంటిమెంటు కష్టాలున్నాయి. నేతలూ గుత్తేదార్లూ రాసుకుపూసుకు తిరిగే రొమాంటిక్ సీన్లూ ఉన్నాయి. ఇది మన కథ. మనందరి జీవితాల్నీ ప్రభావితం చేసే కథ. సమాజమే వెండితెర అయితే, ఆ సినిమా పేరు- నల్లధనం. దోపిడీ...! పచ్చి దోపిడి, నల్లడబ్బు గణాంకాల్ని చూడగానే సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తే నోరెళ్లబెట్టారు. ఇంతకాలం ఎందుకు కట్టడిచేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. పర్యవసానాలను తలుచుకుని తల్లడిల్లిపోయారు పైపైకి ఇదేదో పన్నుల ఎగవేతకు సంబంధించిన వ్యవహారంలా అనిపించవచ్చు. కుబేరులకు మాత్రమే వచ్చే తలనొప్పి అన్న అభిప్రాయమూ కలగవచ్చు. కాదుకాదు. నల్లదనం అందరి సమస్య ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరి జీవితాన్నీ ప్రభావితం చేస్తుంది. నల్లడబ్బు స్వభావమే నలుపు. నోటు మాత్రం పచ్చగానే ఉంటుంది. బాపూజీ బోసినవ్వుల బొమ్మ తప్పక కనిపిస్తుంది. పైకెత్తి చూస్తే రక్షణరేఖ. కింద రిజర్వు బ్యాంకు గవర్నరు సంతకం, సందే...

ధీరవాణి

సత్సంబంధాలు నెలకొల్పండి ఏ వ్యక్తీ, ఏ జాతీ ఇతరులను ద్వేషించి మనజాలదు. మన మేధావులు 'మ్లేచ్ఛ' అనే శబ్దాన్ని సృష్టించి ఇతరులతో కలసిమెలసి జీవించటం ఏ రోజున మానివేశారో ఆనాడే భారతదేశ పతనం ప్రారంభమైంది. కనుక మనం ఆ స్థితి నుంచి బయటపడగలగాలి. ఒక వ్యక్తిగాని, జాతిగాని ఇతరులతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా, తామే గొప్పవారమని, తమ మతం మరియు తమ ఆచారవ్యవహారాలు మాత్రమే శ్రేష్ఠమైనవని భావించి ఏకాకి జీవనాన్ని ఏర్పరచుకుంటే అది ఆ వ్యక్తికి, జాతికి పతనకారణమవుతుంది. పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధర్మాన్ని అలవరచుకోండి. భారతదేశం తిరిగి తన పూర్వ ఔన్నత్య శిఖరాలను అధిరోహించాలంటే తనకున్న పారమార్ధిక సంపదను ఇతర జాతులకు అందుబాటులో ఉంచగలగాలి. ఆయా జాతుల సంపదను మనకు అవసరమైన మేరకు స్వీకరించటానికి సంసిద్ధంగా ఉండాలి. “వికాసమే జీవితం, సంకుచితత్వమే మరణం. అట్లే ప్రేమతత్వమే జీవికకు చిహ్నం, ద్వేషభావన మరణ సదృశ్యం." కనుక విశాలహృదయులై ఉన్నత శిఖరాలు అధిరోహించండి. మీ జాతికే కాక, యావత్ప్రపంచానికీ ఆదర్శప్రాయులవుతారు. ఎల్లలెరుగని ప్రేమమయ సామ్రాజ్యాన్ని నిర్మిద్దాం. అప్పుడు మాత్రమే భారతదేశం తన సముద్ధరణను కండబలంతో కాకుండా, ఆత్మశక్తిత...