పైసామే పరమాత్మా
పైసామే పరమాత్మా
------విరించి విరివింటి------
16 Jan 2022
ఆ మధ్యన my sunne leon ban na chahthi hoon అని వర్మ ఒక షార్ట్ ఫిలిం తీస్తే చాలామంది అదో గొప్ప సినిమా అని వాదించారు. ఆడవాళ్లకు తమ శరీరాన్ని అందాన్ని డబ్బు చేసుకోగలిగే స్వేచ్ఛ ఉండాలనీ అది వుమెన్ ఎంపవర్మెంటుకి సంబంధించిన గొప్ప సినిమా అని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఒకాయన వర్మ వీర ఫ్యాన్ లాగా ఉండేవాడు ఆ తర్వాత ఆయన ఫౌంటెన్ హేడ్ పుస్తకాన్ని తెలుగులోకి కూడా అనువాదం చేసినట్టున్నారు. ఆయన ఎంతగా వర్మలో ఐక్యమయ్యాడంటే ఆ సినిమా లో చెప్పినట్టు తన ఇంట్లో ఏ ఆడవారైనా పోర్న్ స్టార్ ఔతానంటే తాను వెంటనే సంతోషంగా పంపిస్తానని చెప్పాడు. అటువంటి పనికిమాలిన సినిమాలు తీయొద్దని ఒక పెద్దావిడ లైవ్ లో ఫోన్లో మాట్లాడుతుంటే నీవు కూడా అందంగా ఉన్నావు..నిన్ను కూడా పోర్న్ స్టార్ గా పెట్టి సినిమా తీస్తా అని ఏమాత్రం ఇంగితం లేకుండా అన్నాడు వర్మా. అతడినొక మహా మేధావి అని వెనుకేసుకొచ్చే ఒక బ్యాచొకటి తయారైంది.
సరే ఇదంతా పక్కన పెడితే పోర్న్ ఇండస్ట్రీ అంటే ఏమిటో తెలియకుండా అందులోకి పోవాలనుకోవడం వుమన్ ఎంపవర్మెంటుతో సమానం అని అనుకోవడం ఎంత భయంకరమో ముందు తెలుసుకోవాలి. Chris Hedges రాసిన Empire of Illusion పుస్తకం ఒక eye opener. ఇంకా చదవాలనుకునేవారుRobert Jensen రాసిన "Getting off: Pornography and the End of Masculinity" పుస్తకం కూడా చదవవచ్చు.
ఈ పోర్న్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అనేది ఆ పుస్తకంలోని illusion of Love అనే రెండవ అధ్యాయం లో వివరిస్తాడు Chris Hedges.
" పోర్న్ సినిమాలు సెక్స్ కి సంబంధించినవి కావు. వి కేవలం మేకప్ లతో కంప్యూటర్లతో తళుకుబెళుకులు అద్దబడిన సినిమాలు. వాటిల్లో ఏ స్త్రీ తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేందుకు ఉండదు కాబట్టి నటన కూడా ఉండదు. వాళ్ళు చూపించే ఒకే ఒక్క ఎమోషన్ ఏంటంటే స్త్రీ కి పురుషున్ని సంతృప్తి పరచడంలోనే ఎడతెగని కోరిక ఉన్నట్టు చూపడం. ఈ కోరికలో స్త్రీ తన శారీరక మానసిక అబ్యూజ్ ని కూడా ఒప్పుకుంటున్నట్టు చూపడం. ఈ సినిమాల లైంటింగ్ రోగగ్రస్తమై ఉంటుంది. Pubic hair తొలగించబడి అమ్మాయిలు పడుచు పిల్లల్లాగా రబ్బరు బొమ్మల్లాగా చూపబడతారు. ముడతల్లేని శరీరాలు, విపరీతాకృతిలో కృత్రిమ స్తనాలు, ఎప్పటికీ నిలిచి ఉండే అంగస్తంభనలూ మనిషిలో సహజంగా ఉండే అసంపూర్ణతలన్నింటినీ కప్పి పెట్టి పచ్చి అబద్దాన్ని నిజమని నమ్మించడం. స్త్రీలు కేవలం వస్తువుల్లాగా సహజమైన అందాన్ని కోల్పోయినట్టుగా నిజమైన భావోద్వేగాలను పలికించలేనట్టుగా కనిపిస్తుంటారు. పోర్న్ సెక్స్ ని ప్రమోట్ చేయదు. ఇద్దరు వ్యక్తులు భాగస్వామ్యమయ్యే చర్యగా సెక్స్ ని తీసుకుంటే పోర్నోగ్రఫీ మాస్టర్బేషన్ ని ప్రమోట్ చేస్తుందే తప్ప సెక్స్ ని కాదు".
కొంత మంది పోర్న్ స్టార్ ల ఇంటర్వూలను ఈ చాప్టర్ లో పొందుపరిచాడు. Rolden అనే పోర్న్ స్టార్ ఏమంటుందో చూద్దాం.
"నా మొదటి సినిమాకు 1000 డాలర్లు ఇస్తామన్నారు కానీ 600డాలర్లతో సరిపుచ్చారు. సినిమా అయ్యాక నాకు గనేరియా సోకింది. మేము ప్రతినెలకోసారి HIV వంటి టెస్టులు చేసుకోవలసి ఉంటుంది కానీ నెల లోపల ఎన్నో సీన్స్ ఎంతోమందితో చేయాలి కాబట్టి నెల రోజులకొకసారి మాత్రమే టెస్టు చేయడం చాలా ప్రమాదం. గనేరియా తగ్గాక మళ్ళీ సినిమాలు చేయాల్సి వచ్చింది. ఎన్నోసార్లు గనేరియాతో పాటు హెర్పిస్ వంటి ఇతర STDల బారిన పడ్డాను. కొన్నిసార్లు అబర్షన్ కూడా జరిగింది. అక్కడ వాళ్ళు ఏది చెబితే అదే చేయవలసి ఉంటుంది. కాంపిటీషన్ చాలా ఎక్కువ. నేనలా చేయను అని చెబితే వెంటనే నా ప్లేస్ లో చేయడానికి మరెవరినైనా పెట్టుకుంటారు. ఈ వృత్తి లో ఉన్న అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా ఇందులోకి దింపితే వారికి కిక్ బాక్స్ వస్తాయి. కొంత స్టార్ లాగా పరపతి పెరుగుతుంది. ఎక్కువ అటెన్షన్ ఇస్తారప్పుడు. ఒకరితో చేయడం పోయి ఒకేసారి ఎక్కువ మందితో చేయడం మొదలవుతుంది. చాలా రఫ్ గా చేయాలని మగవారికి నియమం ఉంటుంది. ఎంత నొప్పైనా కనబడనట్టు మమ్మల్ని ఇంకా బాధపెట్టి క్రీడించమన్నట్టు మేము అభినయించాలి. వాళ్ళు మా మీద ఉమ్మిస్తారు. మొదటి సారి ఒక వ్యక్తి అలా నా మీద తుపుక్కున ఉమ్మేసినపుడు చాలా బాధపడ్డాను. కానీ లోపల ఆలోచించాను. నేను ఇలా ఉంటేనే నన్ను పోర్న్ స్టార్ అంటారు కదా అని. Im your bitch అని అటువంటి మాటలు అనాలి. పోర్న్ చూసే వారికి ఆడవారిని హింసించడమే కావాలి. వారి చెవులకు ఇటువంటి మాటలే వినిపించాలి. కాబట్టి మేము ఆ హింసను స్వాగతిస్తున్నట్టుగా ఆ హింసను కోరుకుంటున్నట్లుగా నటించాలి. మేము చేసే సినిమాలు ఎవరు చూస్తారో తెలియదు. కానీ వారంతా ఆడదాన్ని డిగ్రేడ్ చేయడంలోనే ఆనందాన్ని పొందేవారే ఐవుంటారు. అలాంటివారే చూస్తారు కాబట్టి మేము అలాగే నటించవలసి ఉంటుంది. మలద్వారం గుండా చేయడం ఇక్కడ తప్పదు. కేవలం బాగా పేరు పరపతి ఉన్న స్టార్స్ మాత్రమే ఈ రకమైన సెక్స్ ని మేము చేయము అని చెప్పగలుగుతారు. ఇంకాస్త పేరున్న వారు హాయిగా ఇతర ఆడవారితో చేసే సినిమా వరకే ఒప్పుకుంటారు. మిగితా వాళ్ళకు అంత స్వేచ్ఛ ఉండదు. మొదటి సారి ఎక్కువ మందితో చేసినపుడు నాకు విపరీతమైన నొప్పి వచ్చింది. ఇదంతా రఫ్ గా చేయవలెననే నియమం. అంతే కాకుండా మలద్వారం నుండి డైరెక్టుగా తెచ్చి నోట్లోపెడతారు. నా మలాన్ని నేనే నోట్లో పెట్టుకోవడం వంటిదిది. కానీ ఒక్కోసారి వేరే అమ్మాయి మలద్వారం నుండి తెచ్చి నానోట్లో పెడుతుంటారు. ఇది మరీ దారుణంగా ఉంటుంది. అందుకే చాలామంది షూటింగ్ కి ఒకరోజు ముందర ఏమీ తినరు. నేను కూడా పూర్తిగా వెజిటేరియన్ గా మారుతుంటాను. షూటింగ్ రోజు ఉదయం ఎనిమాలతో మొత్తం ఫ్లష్ ఔట్ చేసేస్తాను. షూటింగ్ అయ్యాక కనీసం బాత్రూం కి కూడా పోలేను. కడుపునొప్పితో బాధపడుతుంటాను.
ఒక్కోసారి ఎంత భయంకరంగా ఉంటుందంటే కొన్ని రోజులవరకు మలద్వారం తెరుచుకునే ఉంటుంది. ఆ నొప్పి చెప్పనలవి కాదు. మలద్వారాలు పగిలి రక్తాలు కారడం మల కవాటం (anal sphincter) వదులుగా అయి మలం బయటకు కారడం సర్వ సాధారణం. వాటికి సర్జరీలు చేసుకుంటాం. యోని మార్గంలో ఏర్పడే పగుళ్ళకు కూడా సర్జరీలు తప్పవు.
ఇంతా చేశాక మిగిలేది ఏమీ ఉండదు. శారీరక గాయాలను తగ్గించుకోవడానికి - మందులు, ఆపరేషన్లు, స్త్రీ డిగ్రేడేషన్ నీ మానవ డిగ్రేడేషన్ ని తట్టుకోలేక కలిగిన మానసిక గాయాలకు - మద్యం,డ్రగ్స్ . మిగిలింది కేవలం కొంత డబ్బు కొన్ని లైంగిక జబ్బులు అంతే. చాలా మంది వీటికే బానిసలై జీవితాల్ని ముగిస్తారు. చాలామంది ఒంటరితనంతో సతమతమౌతారు. ఏదో ఒక మనిషి తోడు కోసం తపిస్తారు".
Getting off పుస్తకం రాసిన Robert Jensen ఏమంటాడంటే "ఎపుడైతే మార్కెట్ లోకి పోర్న్ సినిమాలు విపరీతంగా రావడం మొదలైందో కథల కొరత వలన కొత్తరకమైన పోర్న్ పద్దతులు వస్తే తప్ప లాభాలు రాని పరిస్థితి నెలకొంది. అందుకే 1970s లో సెక్స్ ని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే క్రియలాగా చూపించిన సినిమాలు 1980s కి వచ్చే సరికి కొత్త పుంతలు తొక్కాయి. క్రూరరూపమైన సెక్స్ అక్కడినుండి మొదలైంది. multiple people, Rough sex, anal sex వంటివెన్నో శారీరక మానసిక డిగ్రేడేషన్ ని చూపించి లాభాలు ఆర్జించేందుకు వచ్చాయి.
క్రూరత్వాన్ని సులభంగా మార్కెటైజ్ చేసే మన సంస్కృతి గురించి ఏం చెప్పాలి?. యుద్ధంలో హింసను గ్లోరిఫై చేయడానికీ పోర్న్ లో సెక్సువల్ డామినేషన్ ని గ్లోరిఫై చేయడానికి పెద్ద తేడా ఏమీ లేదు. మన సంస్కృతి పోర్న్ తో సాచురేట్ కావడం వలననే సెక్స్ గురించి మాట్లాడటానికి చాలామంది వెనుకాడుతుంటారు. పోర్న్ మనలో మనకు నచ్చని విషయాన్ని బయటపెడుతుంది. మనం స్త్రీ ఒక లైంగిక వస్తువు మాత్రమే అని చెప్పే సంస్కృతి లో మునిగిపోయి వున్నాం. పోర్నోగ్రఫీ లో కనబడే స్త్రీలు మనుషులు కాదు. వాళ్ళు కేవలం శరీరాలు. వాళ్ళు పాల్గోనేది సెక్స్ లో కాదు. హింసతో క్రీడించే ఆటల్లో. చాలామంది మగవారు దానిని ఇష్టపడతారు. పడుతున్నారు".
జాన్ మెజా అనే పోర్న్ స్టార్ ఏమంటుందో చూడండి. (ఈమెపోర్న్ స్టార్ గా భయంకరమైన జీవితాన్ని అనుభవించి పెయిన్ కిల్లర్స్ కి డ్రగ్స్ కి బానిసయ్యి అందులోంచి బయటకు వచ్చి టెక్సాస్ యూనివర్సిటీ నుండి సైకాలజీ లో డాక్టరేట్ చేసింది) " సమాజం వాస్తవికతనుండి దూరం జరిగే కొద్దీ ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలలో వాస్తవికతనుండి దూరం జరిగేకొద్దీ ప్రజలకు ఇతరులతో ఎలా మసలుకోవాలో తెలియడం తగ్గిపోతుంది. ఇతరుల స్పందనలకు ఎలా అర్థం చేసుకోవాలో తెలియకుండా తయారవుతుంది. ఇలాంటి వాళ్ళందరూ పోర్న్ వైపు మరలుతుంటారు. మనుషులు ఈ ఫాంటసీ వైపు తిరిగి ఇదే నిజమనుకుని ఇదే భ్రమలో జీవించడం మొదలుపెడతారు. ఇది నిజ జీవితంను అర్థం చేసుకోలేని ఒక కొత్త జబ్బుగా పరిణమిస్తుంది.
పోర్న్ స్టార్ గా సెట్స్ మీదకి వెళ్ళాలంటే శరీరాన్నీ మనసుని స్తబ్దతలోకి కొనిపోవాలి. ఎంత స్తబ్దతగా ఉండగలిగితే అంత పర్సనల్ లైఫ్ ఉండదు. అందుకే జీవితంలో డ్రగ్స్ బానిసత్వం తప్ప మరోటి మిగలదు. ఒక నలభై ఐదు నిమిషాల సినిమాకి పదమూడుగంటల షూటింగ్ ఉంటుంది. మేమపుడు గాయపడి ఉంటాము. అలసిపోయి ఉంటాము. గాయాలనుండి రక్తం కారుతూ ఉంటుంది. మా శరీరాల మీద ముఖం మీద మేల్ ఆర్టిస్టుల సెమెన్ పడి ఉంటుంది. వాసనగా కంపరంగా ఉంటుంది. మేము దాన్ని తుడిచేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళంతా ఫోటోలు తీసుకోవాలి రకరకాలుగా..ఇంక చాలు అని చెప్పినా ఎవరూ వినేవారు ఉండరు. కాళ్ళు పట్టుకున్నా లెక్క చేయరు. మళ్ళీ వేరే సీన్ కి సిద్ధమవ్వాలి. ఆ సమయంలో వాళ్ళేం చేస్తున్నారో వారికి తెలియదు. వాళ్ళు ఎవరి మనసులను శరీరాలను గాయపరుస్తున్నారో కూడా తెలియదు. పోర్న్ అంటే మానవత్వం అంటే మరిచిపోవడమే. మనుషులం తామని మరిచిపోవడమే"
2006 -07 సంవత్సరం లో ఈ బుక్ రాశారనుకుంటాను. 2006 లోని గణాంకాలు ఇచ్చారు. 2006 లో పోర్న్ బిజినెస్ అక్షరాలా 97 బిలియన్ డాలర్లు. ఇది ఆ సంవత్సరం అమేజాన్ ,నెట్ ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహూ, ఇ- బే, ఆపిల్ ఎర్త్ లింక్, ఈ అన్ని కంపెనీల లాభాలను కలిపినా కూడా ఇ- పోర్న్ ఇండస్ట్రీ లాభం ఎక్కువగానే ఉంది. ఇప్పటి లెక్కలు ఎలా ఉన్నాయో తెలియదు. డబ్బు సంపాదించడానికి మనిషి ఇంతకంటే దిగజారడం ఉండదేమో. అటువంటి పోర్న్ స్టార్ కావడం ఒక వుమన్ ఎంపవర్మెంటు అని సినిమాలు తీసే వర్మలాంటి వారే మన కాలపు మేధావులు🙆. పైసామే పరమాత్మా హై.
"The most successful Internet porn sites and films are those that discover new ways to humiliate and inflict cruelty on women" ----Chris Hedges------
Slut bus అనే వెబ్సైట్ లో ఉండే వీడియోల్లో కంటెంట్ ఏమిటంటే ఒక అమ్మాయిని ఒక బస్ లోకి లాగేస్తారు. సెక్స్ కోసమని డబ్బిస్తామంటారు. పదిమంది కలిసి బ్రూటల్ గా సెక్స్ చేస్తారు. ఆ తర్వాత ఆమెని పరిగెత్తుతున్న బస్ లోనుండి బయటకు తోసేస్తారు. డబ్బు నోట్లు ఆమె మీదకు విసిరేస్తారు. మెసేజ్ చాలా క్లియర్. "ఆడవాళ్ళు సెక్స్ టాయ్స్ గా మాత్రమే పనికొస్తారు. వాళ్ళను అందుకు మాత్రమే ఉపయోగించుకుని విసిరివేయవచ్చు"అని. (మనకు గుర్తుకు వచ్చే సంఘటన ఏంటో చెప్పనవసరం లేదు)
ప్రస్తుతం ఫ్లోరిడాలో జైల్లో ఉన్న Max hardcore అనే పోర్న్ స్టార్ ఎన్నో రకాలైన టార్చర్ ప్రయోగాలను ఆడవాళ్ళపై చేశాడు. ఆడవారి మలద్వారం లోకి యోనిలోకి తన చేయినంతా పెట్టిన మొదటి వ్యక్తిగా పోర్నో ప్రపంచంలో కీర్తింపబడ్డవాడు. ఇతడి తర్వాతే ఇటువంటి రకరకాల పద్ధతులలో ఆడవారిని హింసించడాన్ని పోర్న్ ఇండస్ట్రీ లాభాలకోసం మొదలు పెట్టింది. అతడు ఆడవారిపై ఉమ్మేసేవాడు. కాళ్ళతో తన్నేవాడు. జుట్టు పట్టి లాగేవాడు. వాళ్ళ ముఖాల్ని కమోడ్ లో పెట్టి ఫ్లష్ ఆన్ చేసేవాడు. తాళ్ళతో కట్టేసి కుక్కలా చూసేవాడు. వారిపై మూత్రం పోసేవాడు. నోట్లో మూత్రం పోసేవాడు. వారిని slut, bitch, cunt, whore అంటూ తిట్టేవాడు. ఆడవాళ్లు పదిమందితో తన్నులు తింటూ ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు మలద్వారంలో అంగాలను దూరుస్తుంటే మరింత నొప్పి కలిగించమనీ తమను slut ani bitch అనీ తిట్టమనీ..తాము slut and bitch అనీ వాళ్ళు నొప్పితో అరుస్తూ అంటుంటారు.
Barry అనునతను తీసే టార్చర్ వీడియోలు చాలా చోట్ల ఇల్లీగల్ చేయబడ్డాయి. అతడు "చిత్రహింసల ద్వారం" "నొప్పి వీరులు" వంటి పేర్లతో పోర్న్ బిజినెస్ చేస్తాడు. ఆయన తీసే వీడియోల పేర్లు "పోర్న్ స్టార్ పై చిత్రహింస" "గర్భవతే కానీ రెడీ" "మదమెక్కినది చివరికి లొంగింది" ఈ అన్ని వీడియోలలో హింసనే ప్రధానమైనది. అతడికి గవర్నమెంట్ విధిస్తున్న ఆంక్షలపై విపరీతమైన కోపం ఉంది. ప్రపంచమంతా ముక్కుపచ్చలారని అమ్మాయిలను టార్చర్ చేస్తుంటే చూడాలనుకుంటుంది. నేను వాళ్ళు కోరుకున్నదే కదా తీస్తున్నది నామీదెందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి అని వాపోతాడు.
పోర్న్ లో భయంకరమైన రేసిజం ఉంటుంది. నల్లజాతి మగవారిని చదువులేని అనాగరికులుగా జంతు బలిష్టులుగా కండలుగలిగిన వారిలా చూపితే ఆడవారిని జంతు సమాన కామోద్రేకం గలవారిగా చూపుతారు.లాటిన్ ఆడవారిని అందంగా అనుకులవతుల్లాగా, ఆసియావారిని సిగ్గరులైన వేశ్యలుగా చూపుతారు. Interracial pornography లో నల్లవారి శరీరాలను సెక్స్ పట్ల అదుపులేని జంతువుల్లాగా చూపడం అనేది అదే నల్లవారిని అదే కారణంవలన సామాజికంగా దూరంగా పెట్టేందుకు వారిపై స్టీరియోటైంపింగ్ కు ఉపయోగపడుతుంది.
మగ పోర్న్ స్టార్ లకు స్త్రీలకు ఇచ్చే డబ్బులో మూడో వంతు ఇస్తుంటారు. వారు చేయగలిగిన ఏకైక కార్యం అగస్తంభనను ఎక్కువ సేపు నెరపగలగడం. అందుకై వారు వయాగ్రాను వాడటం కోవర్జెక్ట్ ఇంజెక్షన్ ని అంగంమీద ఉండే రక్తనాళంలోకి ఎక్కించుకుంటారు. వారి అంగాలకింద రోజూ తీసుకునే ఈ ఇంజెక్షన్ల వలన రంధ్రం పడి ఉంటుంది. ఒక్కసారి రక్తం కారుతూ ఉంటుంది. ఐతే వారు ఈ మందులు ఇంజెక్షన్లు తీసుకుంటే తప్ప అంగస్తంభన జరగని దశకు చేరుకుంటారు. వాళ్ళ ఇండ్ల లో ఫ్రిజ్ లలో ఇవే ఇంజెక్షన్లు నిండి ఉంటాయి. మగ పోర్న్ స్టార్ లు కండోమ్ వేసుకుని చేస్తే మార్కెట్ లో విలువ ఉండదు. కంప్యూటర్ గ్రాఫిక్స్ తో కండోమ్ కనబడకుండా చేయవచ్చు కానీ గ్రాఫిక్స్ కి డబ్సు తగలేయడం మేకర్స్ కి ఇష్టముండదు. అందుకే వారిని కండోమ్ లేకుండానే చేయమని వారిని జబ్బులబారిన పడేలా చేస్తుంటారు.
ఇదే చాప్టర్ Illusion of love లో ఎన్నో విషయాలు పొందుపరిచారు Chris Hedges. ఐతే ఇవి రాయడం కూడా కొంతమందికి ఇష్టం లేకపోవడం విచిత్రంగా ఉంది. పోర్న్ ఉండటం వేరు..పోర్న్ లో ఆడవారినీ బ్రూటలైజ్ చేయడం రేసిజాన్ని చూపడం వేరు. ఇవి ఆధిపత్య ధోరణులు. వీటిని ఖండించవలసింది పోయి పోర్న్ వలన లాభాలున్నాయంటూ వర్మ వంటి కన్ఫ్యూజ్డ్ మేధావులు మొదలయ్యారు. ఆయా దేశాల్లో చట్టాలున్నాయి ఈ పుస్తకంలో చెప్పినట్టు ఏమీ ఉండదు అని కొందరి అభిప్రాయం. సరే అది మీ అభిప్రాయం ఐతే అందులో దూరి జీవితాల్ని కోల్పోయిన వారి మాటలనూ వినగలిగితే వినండని నా సలహా. పోర్న్ కి అడిక్ట్ అయిన స్మిత్ అనే ఒక యువకుడు ఏమంటాడంటే " ఆడవారితో సఖ్యంగా ఉండగలిగే శక్తిని నేను కోల్పోయాను. పోర్న్ లో చూపే ఫాంటసీకి సంబంధ బాంధవ్యాలలో ఉండే నిజమైన జీవితానికీ మధ్య తేడాను గుర్తించలేకపోయాను. పోర్న్ మనం ఆడవారి గురించి ఆలోచించే ఆలోచననే మార్చేస్తుంది. నిజజీవితంలో ఉండే ఆడవారు పోర్న్.లో చూపించిన ఆడవారిలాగే ఉండాలని మనం కోరుకుంటాం. అందుకే నేను ఆడవారితో ఎప్పుడూ స్నేహంగా ఉండలేకపోయాను. నేను ఎవరినో హర్ట్ చేయాలనే మనస్తత్వం ఉన్నవాణ్ణి కాను. అందుకే ఆడవారికందరికీ దూరంగా ఉండేవాడిని. అది నన్ను ఎంతగా డ్యామేజ్ చేసిందో నాకా సమయంలో అర్థం కాలేదు. ఆ అడిక్షన్.లోనుండి బయటకు వచ్చాకనే మనుషులంటే సంబంధ బాంధవ్యాలంటే అర్థమవడం మొదలైంది".
విరించి విరివింటి
Comments
Post a Comment