Enjoying Editions (సంతోషపరిచిన సంపాదకీయాలు).... is Bharghava Shyam's Collection with Editing or Keeping the same content... as "Awared Nice Bookmarks Share": 👁️🗨️👌🔖♻️, . And trying to manifest "Tranquil Resonative Eminent Expressions" -🌳
Mallesh Koruturi
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా దూషించినా పడతాం అంటే, అది బలం అవ్వదు బలహీనత అవుతుంది...
రామాయణం గురించి చర్చ వచ్చినప్పుడు వంశీ అన్నయ్య నాతో పంచుకున్న వ్యాసం ఇది.. అపరిచితుని ప్రశ్న: మీరు రామాయణం గురుంచి చాలా బాగా చెప్పారు…నేను కూడా మీలా సంపూర్ణంగా రామాయణం చదవాలని అనుకుంటున్నాను…నాకు ఒక మంచి పుస్తకం సూచించారా? కళ్యాణ్ జవాబు: తప్పకుండా చెప్తాను. ఏ రామాయణమో మాత్రమే కాదు, ఎలా చదవాలో కూడా చెబుతాను. అలా తప్పక చదవండి. అది వేరేదేదో ‘పుస్తకం’ కాదు. శ్రీమద్రామాయణమే! ముందు రామాయణం ఒక పుస్తకం కాదు, అలా అని నమ్మండి. రామాయణం పుస్తకం అనుకుంటే దానికీ స్పైడర్ మ్యాన్ కామిక్ కీ తేడా వుండదు. రామాయణము ఇతిహాసమని నమ్మండి. ఇతిహాసము అంటే, "ఇది ఇట్లే జరిగినది" అని. ఒకడు ధర్మాన్ని ఆచరించమని చెప్పటం వేరు. తన బ్రతుకంతా ధర్మాచరణ చేసి మనకి అది సాధ్యమేనని నిరూపించటం వేరు. అలా చూస్తే, రామాయణము మనకి ఆదర్శమవుతుంది. పుస్తకం అనుకున్నంతకాలం అవదు. అలాగే, ఎన్నో రామాయణాలున్నాయి. అన్నిటి కన్నా ఆదికావ్యము మాత్రము శ్రీ వాల్మీకి రామాయణము. అదే ప్రమాణము. కేవలము వాల్మీకి మహర్షి మాత్రమే బ్రహ్మగారి వరము చేత అసలు కథంతా ఎప్పుడు ఏమి జరిగిందో , ఎవరి మనసులో ఏముందో తో సహా కంటికి కనపడి రాసారు. అందులో కల్పితము లేదని న...
బిడ్డకు మంచి చెప్పాలన్నదే ఏ తండ్రి తాపత్రయమైనా. ఆ ప్రయత్నంలో పురాణాలు ఉటంకిస్తాడు. నీతికథలు చెబుతాడు. ఇరుగుపొరుగు జీవితాలు ఉదాహరణగా చూపుతాడు. తన అనుభవాలనూ వివరిస్తాడు. కొన్నిసార్లు అలతి పదాలతో, కొన్నిసార్లు కఠిన వాక్యాలతో, కొన్నిసార్లు మార్మికంగా సన్మార్గాన్ని బోధిస్తాడు. అరుదుగా, ఏ ఆత్మీయులతోనో తన మనసులోని మాట చెప్పిస్తాడు. పరమాత్మ ప్రయత్నమూ అలాంటిదే. భగవద్గీత, అనుగీత, ఉద్ధవగీత, జాబలిగీత, బ్రహ్మగీత, అష్టావక్రగీత... ఇలా అనేకానేక మార్గాల్లో మనిషికి మార్గదర్శనం చేశాడు. గీతా జయంతి (డిసెంబరు 11) సందర్భంగా సకల గీతల సంక్షిప్త పరిచయం... తస్మాత్ ధర్మమయీ గీతా సర్వజ్ఞాన ప్రయోజికా సర్వశాస్త్ర సారభూతా విశుద్ధాస విశిష్యతే. గీత... ధర్మసారం, జ్ఞానహారం, సకలశాస్త్రాల సమాహారం! *** నేనెవరు? తాను పశువును కానని తెలుసుకున్నాడు. పక్షినీ కానని అర్థం చేసుకున్నాడు. క్రూర మృగాలకంటే భిన్నమైన ప్రాణినని గ్రహించుకున్నాడు. వానరంతో దగ్గరి పోలికలున్న నరుడినని నిర్ధారించుకున్నాడు. మానవుడినని ప్రకటించుకున్నాడు. అంతలోనే మరో ప్రశ్న. నేనంటే ఎవరు? కనిపించే శరీరమా, కనిపించని ఆత్మా?... మనిషి మదిలో అనేక సందేహాలు. అతనెవరు? చరాచర...
Comments
Post a Comment