Virat Kohli Mental Health (Telugu)
“మానసికంగా కుంగిపోయాను అని చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపడను. ఇది చాలా సాధారణ విషయమే అయినప్పటికీ.. దీని గురించి మాట్లాడేందుకు మనం సంకోచిస్తుంటాం. మనల్ని మనం మానసికంగా బలహీనులుగా చూసుకోలేం. కానీ, నిజమేంటంటే. మనం బలహీనంగా ఉన్నామని అంగీకరించడం కంటే.. మానసికంగా దృఢంగా ఉన్నామని నమ్మించడం చాలా దారుణం"
“గత పదేళ్లలో నెల రోజుల పాటు నేను బ్యాట్ ను పట్టుకోకుండా ఉండటం ఇదే తొలిసారి. ఇటీవల కొన్ని రోజుల పాటు నా సామర్థ్యాన్ని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నానని గ్రహించాను. నువ్వు చేయగలవు.. పోరాడగలవు.. నీకు ఆ సామర్థ్యం ఉంది.. అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. కానీ, శరీరం మాత్రం ఆగిపొమ్మని చెప్పింది. వెనక్కి తగ్గాలని.. విశ్రాంతి తీసుకోవాలని మనసు సూచించింది. నేను మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తిగా కన్పించొచ్చు. కానీ ప్రతి ఒక్కరికీ కొన్ని పరిమితులుంటాయి. వాటిని మనం గుర్తించాలి. లేదంటే పరిణామాలు హానికరంగా మారొచ్చు"
“సరే.. ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దాం అనుకునే వ్యక్తిని నేను. ఏ పనిలోనైనా పూర్తిగా వివేకం, ఆనందంతో భాగస్వామినవుతా. ఎప్పుడూ అలాగే ఉండటానికి ఇష్టపడుతా. మైదానంలో ఇలా ఎలా ఉండగలుగుతారు? ఆ సామర్థ్యాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. వారికి నేను చెప్పాలనుకునేది ఒకటే.. నాకు ఆట మీదున్న ప్రేమ. ప్రతి బంతితో జట్టుకు సహకరించాల్సింది ఇంకా ఎంతో ఉందని భావిస్తా. మైదానంలోనూ నా పూర్తి శక్తిని ప్రదర్శిస్తా. ఇదేం అసాధారణం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నా బృందం గెలవాలనేదే నా లక్ష్యం"
Virat Kohli
©️ Eenadu.net
#ఈనాడు
Comments
Post a Comment