నంగేలి మరియు చిరుకందన్
నంగేలి:
మనసంతా గతకాలపు జ్ఞాపకాలతో చేదుగా అయిపోయింది.
చిరుకందన్:
గుండెలోతుల్లోకి గుచ్చుకుపోయే ముళ్లను తొలగించుకుని నవ్వుకుంటూ బతకడం అలవాటు చేసుకోవాలి.
ఎదురుతిరిగితే అవమానాలు భరించాలి.
ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం మంచిదే అయినా ఎదిరించి బతకడం ఎంత కష్టమో తెలిసిన దానివి. నీ నిర్ణయాన్ని నువ్వే పునరాలోచించుకోవాలి’
నలుగురూ నడిచే దారిలో వెళ్తే తినే బియ్యం గింజలమీద మన పేరు రాసి ఉంటుంది. సొంత దారిలో వెళ్లాలనుకుంటే అవే బియ్యం గింజల్ని మన దేహంపైన చల్లుతారు.
నంగేలి:
గుండెలమీద ఏ ఆచ్ఛాదనా లేకుండా అందరి ముందూ తిరగాలంటే నాకెంత అవమానంగా ఉంటుందో ఆలోచించారా.
బయటకి వెళ్తే అర్ధనగ్నంగా ఉన్న మా దేహాలపైన వాళ్లు చూపుల శూలాల్ని గుచ్చుతున్నారు. స్త్రీలు ఏ కులంలో పుట్టినా స్త్రీలే! పుట్టిన పసిబిడ్డకు కూడా నలుగురి ముందూ పాలివ్వాలంటే తల్లి ఎంతో సిగ్గుపడుతుంది. అలాంటిది మొలకు చిన్న వస్త్రాన్ని చుట్టుకుని ఎదభాగాన్ని వదిలేయడమంటే బతికుండగానే రాబందులు పీక్కుతిన్నట్లుగా ఉంది.
తమ ఎదను కప్పుకోవడానికి ఉన్నత కులాల స్త్రీలకు అనుమతులిచ్చిన రాజులు, కింది కులాల ఆడవాళ్ల రొమ్ములపైన పన్నులు వేసి మనుగడ సాగించడం నీచకరం.
నాకోసం కాకపోయినా నా తర్వాతి తరాల విముక్తి కోసమైనా ఏదో ఒకటి చేయాలి’’ నంగేలి మాటల్లో దుఃఖపు సుడులేవో తిరుగుతున్నాయి.
చిరుకందన్:
మనసులో ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకోడానికే ఇంత భయపడుతున్నాం.అందం రంగులోనే కాదు, ఆత్మవిశ్వాసంలో కూడా ఉంటుంది అనిపించింది.
నా ముందో నాలుగ్గోడల మధ్యో నీకు నచ్చినట్టుగా ఉండు. గుమ్మం బయటకెళ్తే మాత్రం నీ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించకు. ఎందుకంటే అది వాళ్లకు గర్వంలా, అహంభావంలా కనిపిస్తుంది...’’ అన్నాడు చిరుకందన్.
నంగేలి:
ఆత్మనూనతను జయించాలన్న ఆత్మవిశ్వాసమేదో ఆమె అడుగుల్లో ప్రతిఫలించసాగింది
అందరూ స్త్రీలే... అయినా కులాన్నిబట్టి హెచ్చుతగ్గులు, అంతస్తుల్ని బట్టి హెచ్చుతగ్గులు, అవయవాలను బట్టి హెచ్చుతగ్గులు... తన కళ్లముందే తన జాతివాళ్లంతా ఎదను కప్పుకోకుండా మానాన్ని బహిర్గతం చేయడం నంగేలికి రుచించట్లేదు. నిమ్నకులాల స్త్రీలపట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ అర్థంలేని పన్నులు వసూలు చేయడాన్ని ఆమె తట్టుకోలేకపోతోంది. తన బతుకు ఏమైనా సరే... జాకెట్ వేసుకోవాల్సిందే. చన్నుల మీద పన్నులు వేసి ఆనందిస్తున్న పాలకులకు గుణపాఠం నేర్పాల్సిందే! ఆమెలో ఏదో పట్టుదల...!
Comments
Post a Comment