సందేశాల సంహిత

#సేకరించిన_సంహిత
#అనామిక (అపరిచితుడు)
సూక్ష్మ సవరణ: ఆనాభాశ్యా 

విత్తనం తినాలని చీమలు చూస్తాయ్
మొలకలు తినాలని పక్షులు చూస్తాయ్
మొక్కని తినాలని పశువులు చూస్తాయ్
అన్ని తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనపుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్...

జీవితం కూడా అంతే సమయూ వచ్చే వరకు వేచివుండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక మాత్రమే....  
జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు.
జీవితంలో ఉన్న వాళ్ళు శాశ్వతం అని భావించకు
ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు...
నీకు నీవే ధైర్యం కావాలి నీకు నువ్వే తోడుగా నిలబడాలి.

లోకులు కాకులు, మనస్సును చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు, కనిపించింది వినిపించింది నమ్మేస్తారు. మాట అనేస్తారు.

ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి. 

అబద్దాలతో, మోసాలతో కీర్తి, ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకొన్నా అవి కుప్పకూలి పోవడానికి ఒక్క "నిజం"చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం.

ఒక చిన్న మొక్కనాటి ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని చూడకూడదు. ఎందుకంటే అది పెరగాలి మొక్క వృక్షం కావాలి, పుష్పించాలి, పిందెలు రావాలి, అవి కాయలై, పండితే తినగలం.

అలాగే నేను ఇది కావాలి అనే కోరిక కూడా మొలకై వృక్షమై ఫలవంతం ఔతుందని తెలిసి మసలుకోవాలి.

జీవితంలో కష్టము, కన్నీళ్ళు, సంతోషము, బాధ ఏవి శాశ్వతంగా ఉండవు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులూ, కన్నీళ్ళూ కలగలసినదే జీవితం. 
    
ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి
మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి
చెడిపోతే బాగుపడం నేర్చుకోవాలి
                

గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్ప వారు
దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది
       
ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసిన వాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు

డబ్బుతో మంచం పరుపు కొనవచ్చు కానీ నిద్ర కాదు. గడియారం కొనవచ్చు కానీ కాలాన్ని కాదు.
మందులు కొనవచ్చు కానీ ఆరోగ్యం కాదు.
పుస్తకాలు కొనవచ్చు కానీ జ్ఞానం కాదు
పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు కానీ జీర్ణశక్తిని కాదు. 

ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి 
స్నానాలతోనే పాపాలు పోతే, చేపలే ముందు పాప విముక్తులు కావాలి
తలక్రిందులుగా తపస్సు చేస్తేనే దైవం ప్రత్యక్షమైతే. ముందుగబ్బిలాలకే ఆ వరం దక్కాలి

ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమే లేదు. నీలో లేనిది బయటేమీ లేదు బయటఉన్నదంతా నీలోనూ ఉంది తెలిసి మసులుకో అంతే.

Comments

Popular posts from this blog

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

రామాయణ దృక్పథం

Geeta Jayanti (Special)