Subrahmanyam Koduganti
12 September 2021
ఏది నాకోసం నిలబడి ఉంటుందని నేను ఆలోచించ గలను, నమ్మకం లేని తోవల్లో మోసాల మధ్యన నడుస్తూ, కనపడిన ప్రతి ఆసరాను, వినపడిన ప్రతి మాటనూ అలవోకగా ఒక భరోసా గా భావిస్తూ, తిరిగి పడుతూ, ఆ నిర్ణయం తప్పని భావిస్తూ, ఇక అనంతమైన ఎదో శక్తి ని తలచుకొని...ఆ వెలుగు లో నా నీడ నాకు తోడవుతూ ఉన్నప్పుడు, బహుసా ఆపుడు నా అడుగు బలంగా పడుతుందేమో.
14 September 2021
కొన్ని ప్రదేశాలు బాగుంటాయి ..ఒక్కరే ఉన్నా సరే ..మనసు ని ఎదురుగ పెట్టి మాట్లాడినట్లు
14 September 2021
ఎదో ఒక గురి లేదా లక్ష్యం పెట్టుకో..దాన్ని సాధించు లేదా సాధించే క్రమం లో ఇక్కడి ప్రయాణం గడిపేయ్...
సూక్ష్మంగా చెప్పాలంటే..ఇదే జీవితం. కానీ...
అనుకున్నది సాధించే క్రమం లో చిన్న చిన్న సంతోషాలు అనుభవించడమే అసలైన జీవితం....లక్ష్యం పూర్తీ అయినా కాకపోయినా...
17 September 2021
ఆ చెట్ల కొమ్మలు ఏమి చెబుతాయి ...గాలితో ఏమి చెబుతాయో ఎన్నెన్నో ముచ్చట్లు ...ఆ భాష తెలిస్తే బాగుండును ...మనిషిని వినే కన్నా
18 September 2021
మోసం చేసే ప్రపంచం లో మోసగింపబడడం సహజం. అయితే మనం మోసం చెయ్యకపోవడం వలన లాభం ఏమిటంటే, మనం తిట్టుకొనే జాతి లో మనం ఉండం.
22 September 2021
మోసం పెరిగిపోతూ ఉండడం వలన, మంచితనం ఒంటరి అవుతోంది.
30 September 2021
బాగుండడం అంటే నాకు నచ్చడం అనే థియరీ లోంచే ఆలోచిస్తా కానీ , నచ్చకపోయినా కొన్ని ఎంచుకోవాలని తెలియకపోవడమే ప్రపంచాన్ని చదవని తనం .
03 October 2021
అంటే .....అది మరి ...మరి...రోమ్ లో ఉన్నప్పుడు ...అదన్నమాట సంగతి ...
05 October 2021
సుఖాంతం అయిన కథలు మన నమ్మకాలను బలపరుస్తాయి.
దుఃఖాంతం అయిన కథలు మనకు అనుభవాన్ని ఇస్తాయి .
06 October 2021
నమ్మకం అనేది ఎండిన చెట్టు కొమ్మ లాంటిది ....విరిగితే ఏమి చెయ్యాలో ఆలోచించి ఆ పిమ్మట ఆ కొమ్మ అందుకోవాలి .
10 October 2021
ఒక్కోసారి కొన్ని పోగొట్టుకోవడం కూడా మంచిదే,
ఊహా కనపడేంతగా హద్దులో ఉంటుంది, లేదంటే
కోరిక విశాలమైన చీకటి ఆకాశంలో ఎక్కడో చేరిపోతుంది.
10 October 2021
నీకు నచ్చినట్టు ఉండు.నీకు కావలసింది తీసుకో , అయితే మోసం మాత్రం చెయ్యకు .
మోసం చెయ్యకుండా అలా ఎలా అంటావా అదే నీ సామర్ధ్యం , నీ వివేకం .
10 October 2021
చెడు అంటే సమాజానికి నష్టం చేసే గుణమా లేక మనకు నచ్చని గుణమా అంటే చాలావరకూ మనకు నచ్చని ప్రతి అంశమూ చెడు కిందనే లెక్క వేస్తాము.
అందుకే చెడు పరిమాణం మంచి కంటే పెరిగిపోయినట్లు ఉంటుంది.
13 October 2021
సినిమా మనకు కాలక్షేపం. వాళ్లకు వృత్తి. ఇంతకుమించి సినిమా వృత్తి కలిగిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన అనవసరం.
13 October 2021
మనుషుల్లానే ఋతువులు మారిపోతున్నాయి
చల్లని నిశ్శబ్దం ....ఉదయం మాత్రమే ఉంటుంది.
18 October 2021
పారని నీరు, వాడని ఇనుము పాడవుతాయి అంటారు. పారే యేరు గలగలా శబ్దం చేస్తుంది, ప్రవహించే సమయం మాత్రం శబ్దం ఏమి చేయదు, మనమే సృష్టించాలి ఆ శబ్దాన్ని.
ఎదురుగా ఉంటె బాగున్నావా అని మాట చేర్పు, లేకుంటే అక్షరాల కూర్పు.
21 October 2021
ఇతరులలోని గొప్పతనాలు గమనించి అభినందించడం మంచిదే, అదే సమయం లో మన లోని గొప్పతనాలు కూడా గుర్తించాలి. లేనప్పుడు మెట్లు ఎక్కుతున్న వారిని అభినందనగా చూస్తామే తప్ప మనమూ మెట్లు ఎక్కొచ్చు అని తెలుసుకోం.
22 October 2021
ఒక దగ్గర కూర్చొని నిశ్చలంగా ఉండు అంటే అది మనకు నచ్చదు. కానీ ఎక్కడ కూర్చున్నా నిజానికి మనం అలజడి మోస్తూనే ఉంటాం.
చెరువు వడ్డున ప్రశాంతంగా ఉంటుంది. చిన్న చిన్న అలలు సుతారంగా వడ్డున తాకుతూ ఉన్నా సరే, మనం రాయి విసిరి ఒక పెద్ద తరంగం కోరుకుంటాం.
22 October 2022
నచ్చిన మంచి భోజనం తిని దాన్నిఅరిగించు కోగల ఆరోగ్యాని, వ్యాయామాన్ని కలిగి ఉండాలి.
మరొక విషయం.
నచ్చిన కొందరు వ్యక్తులతోనే మమేకం అవుతూ మిగతా వారిని కాలక్షేపం కోసం గమనిస్తూ ఉండాలి.
ఇది నాలాంటి సీనియర్ సిటిజెన్స్ కోసం...
24 November 2021
ఒకరు వాళ్ళ అభిప్రాయం చెబితే ఇంకొకరు వాదన కి వస్తున్నారు. చాలా పోస్టుల్లో ఇవాళ కామెంట్ల యుద్ధం చూసాను.
ఫేస్ బుక్ చాలా వరకూ ఒక యుద్ధ భూమి.
22 October 2021
మన ఇబ్బందులు ఎవరికన్నా చెబితే వారు వినగలరు, అర్ధం చేసుకోగలరు కానీ వాళ్ళు మన బాధ్యతలను వాళ్ళ తలకి ఎత్తుకోలేరు
కాబట్టీ ఎవరికీ ఏ కష్టం అన్నా చెప్పుకోవడం వరకే మనిషి తృప్తి పడాలి.
మీ చుట్టుపక్కల బలహీన మనస్కులు ఎవరన్నా ఉంటె వాళ్ళతో ఈ విషయం ప్రస్తావించండి.
01 December 2021
మరణం అంటే ఒక భౌతిక రూపం జ్ఞాపకాల్లోకి మారిపోవడమే.
29 December 2021
నీకు నేనున్నాను గా అన్నది ఒక భరోసా మాత్రమే. అది నడిచేందుకు ఊతం మాత్రమే, నడక మనదే అవ్వాలి, నడవలేనప్పుడు చూద్దాంలే అన్నట్టు...
01 January 2022
ఏడాది గా కనపడని వాళ్ళు కూడా శుభాకాంక్షలు చెప్పేసారు.. జనవరి ఒకటి మహత్యం ...
30 May 2022
కదలిక ఉన్నప్పుడే నీటి కి అందం......మార్పు ఉన్నప్పుడే మనిషికి అందం.
Comments
Post a Comment