Hari Raghav

Words from my counseling 
#HariRaghav

02.12.2020
జీవితంలో వచ్చే కష్టాలను ఎదిరించి పోరాడు, లేదా కష్టాలకు అలవాటు పడిపో. మధ్యలో ఉండొద్దు.

14.12.2020
ఈ ప్రపంచంలో నేను ద్వేషించేటంతటి చెడ్డ విషయం గాని, చెడ్డవారు గాని ఎవరూ లేరు.

24.11.2021
ప్రతీ సమస్యకు #పరిష్కారం ఉంటుంది. కానీ పరిష్కారం వలన ఉత్పన్నమయ్యే నూతన సమస్యలను పరిష్కరించుకునే తెగువ ఉండాలి. 

26.11.2021
సోషల్ మీడియా వలన హోటల్లలో ఆహరం #రుచిగా కన్నా #అందంగా వండాల్సి వస్తుంది. ప్రజలు రుచిని ఆస్వాదించడం కన్నా ఆహారంతో సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చెయ్యడంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నారు.

 01.12.2021
ప్రకృతిలో స్త్రీ పురుషులు ఉంటారు. సమాజంలో భార్యా భర్తలు ఉంటారు

28.11.2022
తెలుగు భాషను కాపాడడం అంటే ఇతర భాషలను నేర్చుకునే వారి #నైతికత మీద దాడి చెయ్యడం కాదు. తెలుగు భాష నేర్చుకున్న వారికి మంచి #అవకాశాలు కల్పించడం.

30.11.2022
ఆమె #చెడ్డది అనే మీ అభిప్రాయాన్ని బలపర్చుకోడానికి సైకాలజిస్టుని కలవ వద్దు. ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మాత్రమే కలవండి.

18.12.2022
భౌతికంగా తాకనంత వరకు #మనసు దేనినయితే నమ్ముతుందో బ్రెయిన్ & బాడీకి అదే నిజం

18.12.2021
అమాయకత్వం పోగొట్టుకుని తెలివిని పెంచుకోవాలనే ఆశతో కౌన్సిలింగుకి వచ్చి ఉండొచ్చు. అయినా ఇక్కడ #నిజాయితీ గా బ్రతకడం ఎంత సులభమో మాత్రమే నేర్పబడుతుంది. 

19.12.2021
ప్రతీ మతస్తుడూ ఇతర మతాల పట్ల వ్యవహరించే #హేతుబద్ధమైన ఆలోచనా తీరు తన #మతం మీద కూడా ఆచరిస్తే చాలు.


అందమైన కల వచ్చినపుడు దానిని కలగా ఆస్వాదించాలి. అది నిజం కాలేదేనని బాధ పడకూడదు.ప్రేమ పూర్తిగా మానసికమైనది. శృంగారం కొన్నిసార్లు మానసికమైనది, మరి కొన్నిసార్లు శారీరక వాంఛ తీర్చుకోవడానికి, మరి కొందరికి (సాధారణంగా పురుషులలో) అహం చల్లార్చుకోడానికి..

Love is purely psychological. Sex is sometimes psychological, sometimes physical, and for some (usually men) an ego quench.
When you have a beautiful dream, enjoy it as a dream. Don't worry that it can't be true. (3 Oct 2022)

సమాజం నిజాయితీగా ఉండదు. సమాజంలో నిజాయితీకి విలువ ఉంటుంది.
Society is not honest. Honesty is valued in society.




Comments

Popular posts from this blog

Sandhya Vandana Mantralu (For Bharghav Shyam)

రామాయణ దృక్పథం

Geeta Jayanti (Special)