Posts

శనీశ్వరుడు - సి అనురాధ

  శనీశ్వరుడు - సి అనురాధ  కాలింగ్ బెల్ మోగింది. హాల్లో పేపరు చదువుతున్న మా అత్తగారు 'ఎవరో చూడవే' అనడంతో వెళ్ళి తలుపు తీశాను. "ఉన్నారా అమ్మా, మీవారు?" అంటూ లోపలికి ప్రవేశించారు నరసయ్య గారు. నేను పక్కకు తప్పుకున్నాను. సరాసరి లోపలికి వచ్చి సోఫాలో మా అత్త గారికి ఎదురుగా కూర్చున్నారు. మా అత్తగారి కేసి చూశాను. ఆమె మొహం మాడిపోయింది. చేతిలో పేపరు తీసుకుని బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయారు. "ఈరోజు పని కాలేదట. రేపు కచ్చితంగా ఇస్తామన్నారు" నిదానంగా చెప్పాను. ఆయన అదో రకంగా నవ్వుతూ, “ఈ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తారు మీ దొరగారు" అన్నారు వెటకారంగానాకు చివుక్కుమనిపించింది. 'మీకెందుకండీ? మా తిప్పలు మావి' అని గట్టిగా అనాలనిపించింది. కానీ నోరు పెగలలేదు. “ఏమిటీ ఈ రోజు టిఫినూ..." సాగదీస్తూ అడిగారు,  "ఇడ్లీ సాంబారండీ బాబాయిగారూ” అన్నాను. "ఇడ్లీ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావమ్మా. ఏదీ తీసుకురామ్మా, తింటాను” అన్నారు.  చేతులు కడుక్కోడానికి వాష్ బేసిన్ వైపు నడుస్తూ “మరీ ఎక్కువ తేకమ్మా, మూడు చాలు. ఈ మధ్య షుగర్ ఒకటి వచ్చి చచ్చింది" నేనేమీ మాట్లాడకుండా వంటి...

Mahatma Gandhi మహాత్మా గాంధీ (తొలిచూపు))

Image
 బాపు తొలిచూపు! గాంధీ ఆ పేరే పరమమంత్రమై స్వాతంత్య్ర ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపింది. అభేద్యమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో కూల్చేసింది.. సత్యాగ్రహం... ఆ సూత్రం సామాన్యుల్ని అహింసా యోధుల్ని చేసింది. సత్యా నికి పరమోన్నత స్థానం కల్పించింది. సత్యశోధన... ఆ ఆత్మకథ ఎన్నో జీవితాల్ని మార్చింది, ఎందరి ఆలోచనల్నో సరిదిద్దింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో 'మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్' ఒకటి. ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో, వేదికల మీదో వ్యక్తిగత చర్చల్లోనో- ప్రతి నిమిషం...ఏదో ఓచోట, ఎవరో ఒకరు మహాత్ముడిని తలుచుకుంటూనే ఉంటారు. టైమ్స్ పత్రిక 'ఈ శతాబ్దపు స్ఫూర్తిప్రదాత' ఎవరని ప్రశ్నించినప్పుడు ...ప్రపంచం చెప్పిన తొలి రెండు పేర్లలో ఒకటి - గాంధీజీ! ఆరేడు దశాబ్దాల తర్వాత కూడా... ఆయన పేరూ, ఆయన బోధనలూ, ఆయన రచనలూ ఇంత ప్రభావాన్ని చూపుతున్నాయంటే - నేరుగా చూసిన వారు ఇంకెంత సమ్మోహితులై ఉండాలి! జీవితాన్ని మార్చే భేటీ అది, కర్తవ్యాన్ని తట్టిలేపే కరచాలనం అది, పరుసవేది లాంటి పలకరింపది, చూపులైతే స్ఫూర్తి తరంగాలే! నెహ్రూ, పటేల్, వినోబా...ఆ అదృష్టం ఏ కొద్దిమందికో దక్కింది. అయితేనేం, వా...

Geeta Jayanti (Special)

Image
బిడ్డకు మంచి చెప్పాలన్నదే ఏ తండ్రి తాపత్రయమైనా. ఆ ప్రయత్నంలో పురాణాలు ఉటంకిస్తాడు. నీతికథలు చెబుతాడు. ఇరుగుపొరుగు జీవితాలు ఉదాహరణగా చూపుతాడు. తన అనుభవాలనూ వివరిస్తాడు. కొన్నిసార్లు అలతి పదాలతో, కొన్నిసార్లు కఠిన వాక్యాలతో, కొన్నిసార్లు మార్మికంగా సన్మార్గాన్ని బోధిస్తాడు. అరుదుగా, ఏ ఆత్మీయులతోనో తన మనసులోని మాట చెప్పిస్తాడు. పరమాత్మ ప్రయత్నమూ అలాంటిదే. భగవద్గీత, అనుగీత, ఉద్ధవగీత, జాబలిగీత, బ్రహ్మగీత, అష్టావక్రగీత... ఇలా అనేకానేక మార్గాల్లో మనిషికి మార్గదర్శనం చేశాడు. గీతా జయంతి (డిసెంబరు 11) సందర్భంగా సకల గీతల సంక్షిప్త పరిచయం... తస్మాత్ ధర్మమయీ గీతా సర్వజ్ఞాన ప్రయోజికా సర్వశాస్త్ర సారభూతా విశుద్ధాస విశిష్యతే. గీత... ధర్మసారం, జ్ఞానహారం, సకలశాస్త్రాల సమాహారం! *** నేనెవరు? తాను పశువును కానని తెలుసుకున్నాడు. పక్షినీ కానని అర్థం చేసుకున్నాడు. క్రూర మృగాలకంటే భిన్నమైన ప్రాణినని గ్రహించుకున్నాడు. వానరంతో దగ్గరి పోలికలున్న నరుడినని నిర్ధారించుకున్నాడు. మానవుడినని ప్రకటించుకున్నాడు. అంతలోనే మరో ప్రశ్న. నేనంటే ఎవరు? కనిపించే శరీరమా, కనిపించని ఆత్మా?... మనిషి మదిలో అనేక సందేహాలు. అతనెవరు? చరాచర...

బెండమూరి లంక - వంశీకృష్ణ

బెండమూరి లంక ప్రొద్దున్నే నిద్ర లేవటం అనేది అప్పట్లో బొత్తిగా అలవాటు లేని పని. కానీ ఇక్కడ తప్పక లేవాల్సిన పరిస్థితి. నిద్ర లేచి కాలకృత్యాలు అయ్యిన తర్వాత చేసే పని బలే ఇష్టంగా ఉండేది . అదే బయట పెరట్లో నీళ్లు కాచుకోవటం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి . ఈ ప్రదేశం కోనసీమ కావటం వల్ల ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల దైనందిన జీవితంలో ఏ పని అయినా కొబ్బరి చెట్టు నుంచి వచ్చే సరకులతోనే జరిగేవి . మచ్చుకి కొబ్బరి కాయల పైన ఉండే కొబ్బర్తి డొప్పలతో మరియు ఎండబెట్టిన కొబ్బరి చిప్పలతో నీళ్లు కాచుకోవటం . అముజూరులో కూడా ఈ నీళ్లు కాచుకునే కార్యక్రమం ఉండేది కానీ నిత్యం ఉండేది కాదు . ఇక్కడ నిత్యం ఉండేది . అప్పటి కాలం శీతకాలమేమో ప్రొద్దున్నే లేచి పొయ్యి ఎదురుగుండా కూర్చుంటే భలే వెచ్చగా ఉండేది. కొబ్బరి దొప్పలతో వచ్చే మంట గురుంచి పెద్దగా చెప్పేది ఏమి ఉండేది కాదు కానీ కొబ్బరి చిప్పలు మండుతున్నప్పుడు వాటి మధ్యనుంచి ఒక నీలి మంట సర్రు మని వచ్చేది . ఆ శబ్దం మరియు కాంతి చూడటానికి భలే ఉండేది . అచ్చం గ్యాస్ పొయ్యిమీద వచ్చే నీలి రంగులా ఉండేది . అది చూసి నేను గ్యాస్ సిలిండర్ లో ఉండే పదార్థానికి , కొబ్బరి చిప్పలకి ఏదో...

రామోజీ రావు ఈనాడు

రామోజీ రావు ఈనాడు అంటే సామాన్యుడి అక్షరం.. ఈనాడు అంటే కార్మిక కిరణం.. ఈనాడు అంటే విద్యాదీప్తి.. ఇలా ఒకటేంటి 'ఈనాడు'ను ఎన్ని రకాలుగా కీర్తించినా తక్కువే దాని వెనుక ఓ వ్యక్తి కృషి, తపన, పట్టుదల ఉన్నాయి.. ఆయనే రామోజీరావు (Ramoji rao). దినపత్రిక రావాలంటే మధ్యాహ్నం అయ్యే రోజుల్లో సూర్యోదయం కాక ముందే ఇంటి గుమ్మం ముందు దినపత్రిక అందించాలన్న ఆయన ఆలోచనల నుంచి పురుడు పోసుకున్నదే ఈనాడు (Eenadu). నాటి నుంచి నేటి వరకు 'ఈనాడు' వేసిన ప్రతి అడుగూ సంచలనమే. తెలుగు జర్నలిజంలో తనకంటూ సంపాదకుడిగా ప్రత్యేక పేజీ లిఖించుకున్నారాయన. అందుకే ఆయనను 'మీడియా మొఘల్' అని కీర్తిస్తారు. ఆరంభమే సంచలనం: 'సూర్యోదయం తరువాత ఈనాడు పేపర్ బాయ్ వీధుల్లో కనిపించకూడదు'.. ఇది రామోజీరావు గీసిన గీత. పత్రిక పంపిణీలో ఎదురయ్యే సవాళ్లకు ఈనాడు తొలి ప్రస్థానమే సమాధానం. మరే పత్రికా లేని ఓ మారుమూల ప్రదేశంలో 1974 ఆగస్టు 10వ తేదీన పడ్డ తొలి అడుగు.. నేటికీ అనంతమై నిరంతరం, తరంతరంగా అలా సాగిపోతూనే ఉంది. దిన పత్రికల పంపిణీ వ్యవస్థకు 'ఈనాడు' వేసిన బాటే అన్ని పత్రికలకు దారిచూపింది. అప్పటి వరకు పత్రిక కావాలంటే...

ప్రార్ధన 🛐 విశ్వాసం 😇 సహాయం🙏

 ప్రార్ధన 🛐 విశ్వాసం 😇 సహాయం🙏 ఒక పేద ముసలావిడ పది ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ తలిదండ్రులు లేని తన మనవడి ఆకలితీర్చేది!. అనుకోని కరోనా సంఘటనలు వల్ల ప్రభుత్వం నిర్బంధం విధించింది. ఆ నిర్బంధం వల్ల ఇంటి తలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితుల్లో, ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొర పెట్టు కోవడానికి మొకరిల్లి ప్రార్థన చేస్తోంది. ప్రార్థనలో ఆవిడ దేవునితో  " దేవా ..! ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు కాకితో ఆహారాన్ని సమకూర్చావు. అలాగే నా మనవడి ఆకలి కూడా తీర్చగలవని ప్రాధేయ పడుతున్నాను" అన్నది. ఆ మాట విన్న తన మనవడు కాకి ఆహారాన్ని తెస్తుందని నమ్మి , కాకి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి లేవని, వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు. అయితే కిటికీ పక్కనే కాపాలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపుమీద కొట్టి లోపలికి తొంగిచూశాడు. లోపల ఓ పసి పిల్లవాడు బిక్క మోహం వేసుకుని అతనివంక బెదురుగా చూస్తుంటే ..! ఆ పోలీసు "ఏరా? తలుపెందుకు తీశావ్ ..!?" అన్నాడు. ఆ పిల్లవాడు "మా బామ్మ దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు కాకితో ఆహారం పంపుతాడని అంటుంది" అన్నాడు. అందుకే కి...